
టెలికాం పరికరాల దొంగల అరెస్ట్
బళ్లారిటౌన్: ఎయిర్‌టెల్, జియో టెలికాం టవర్ల బ్యాటరీలు, ఎలక్ట్రానిక్ పరికరాలను చోరీ చేసిన నలుగురు నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి సుమారు రూ.30.50 లక్షల విలువ గల పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ శోభారాణి తెలిపారు. బళ్లారి జిల్లా సరిహద్దులోని ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల టెలికాం టవర్ల బ్యాటరీలు, పరికరాల దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. ఈ ఘటనలపై కేసులు దాఖలైనందున నిందితుల ఆచూకీ కోసం ఓ బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. బళ్లారి గ్రామీణ పోలీస్ స్టేషన్ పరిధిలో 5, పీడీ హళ్లి స్టేషన్ పరిధిలో 4, కుడితినిలో ఒకటి, ఆంధ్రప్రదేశ్ 5 కలిపి మొత్తం 15 చోట్ల చోరీలు జరిగినందున నిఘా బృందం తనిఖీ చేసి నిందితులు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వారని, వీరిలో అనాస్, ఇఫ్తార్, దిల్ నవాజ్, మరొకరు అనాస్ అలియాస్ హరెహన్ అనే నలుగురిని బంధించి పరికరాలతో పాటు రూ.5 లక్షల విలువ గల లగేజ్ పికప్ ఆటోను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.