
మైసూరులో హెలికాప్టర్ల ఆర్భాటం
మైసూరు: హెలికాప్టర్ల విన్యాసాలు నగరవాసుల్ని అబ్బురపరిచాయి. మైసూరులో దసరాలో భాగంగా గురువారం సాయంత్రం వాయుసేన హెలికాప్టర్ల ప్రదర్శన కనువిందుగా సాగింది. వేలాదిమంది యువత, ప్రజలు తరలివచ్చారు. ఐదు హెలికాప్టర్‌లు పాల్గొన్నాయి. ఈ నెల 27వ తేదీన వైమానికి ప్రదర్శన భారీఎత్తున జరుగుతుందని సమాచారం.
పట్టుచీరల్లో నడక
మైసూరు పట్టుచీరలు ధరించి, మల్లెలు అలంకరించుకుని మగువలు ర్యాలీ చేశారు. మహిళా దసరాను అట్టహాసంగా ఆరంభించారు. వేలాదిమంది మహిళలు నగరంలో ఊరేగింపుగా సాగారు. కోటె ఆంజనేయస్వామి ఆలయం నుంచి నడక సాగింది. డొళ్లు కుణిత, వీరగాసె సందడి మిన్నంటింది.

మైసూరులో హెలికాప్టర్ల ఆర్భాటం

మైసూరులో హెలికాప్టర్ల ఆర్భాటం

మైసూరులో హెలికాప్టర్ల ఆర్భాటం