
సర్వేకు రాని ఉపాధ్యాయులపై చర్యలు
బనశంకరి: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల గణన విధులకు హాజరుకాని ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని మంత్రివర్గ సమావేశంలో తీర్మానించినట్లు న్యాయశాఖమంత్రి హెచ్‌కే.పాటిల్ తెలిపారు. గురువారం సీఎం సిద్దరామయ్య అద్యక్షతన నిర్వహించిన క్యాబినెట్ భేటీలో పలు నిర్ణయాలను తీసుకున్నారు. ఆ వివరాలను పాటిల్ మీడియాకు వెల్లడించారు. సర్వేలో ఉపాధ్యాయులు పాల్గొనలేదని ఫిర్యాదులు అందుతున్నాయి, హాజరు కానివారిపై చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర వెనుకబడిన వర్గాల కమిషన్‌కు అప్పగించామని చెప్పారు.
కొన్ని ముఖ్య తీర్మానాలు
● డీఎస్పీ గణపతి ఆత్మహత్య మీద కేఎన్.కేశవనారాయణ విచారణ కమిటీ నివేదికను కేబినెట్ తిరస్కరించింది.
● ప్రభుత్వ అధికారులకు వారి స్థాయికి అనుగుణంగా వృత్తి నైపుణ్య కోర్సులు తప్పనిసరి
● బెంగళూరులో అడాప్టివ్ ట్రాఫిక్ సిగ్నల్స్ పథకానికి రూ.56.45 కోట్లు కేటాయింపు
● ఢిల్లీలో చాణక్యపురిలో రూ.16 కోట్లతో కర్ణాటక భవన్ అభివృద్ధి పనులు
● 2019కి ముందు ఉన్న అన్ని వాహనాల డిజిటలరీకరణ కోసం రవాణాశాఖకు
రూ.40 కోట్లు
● బెంగళూరులో పలు ప్రాంతాలలో భూగర్భ మురుగునీటి సరఫరా, నీటి శుద్ధీకరణ ప్లాంట్ల ఏర్పాటు. దేవనహళ్లి వద్ద ఐటీపార్కు, ఎలెమల్లప్పబెట్ట, సాదరమంగల తదితర ప్రాంతాలలో ఏర్పాటుకు నిర్ణయం.
కేబినెట్ భేటీలో నిర్ణయం