
మది మదిలో దసరా ఉల్లాసం
బొమ్మనహళ్లి: రాష్ట్రంలో దసరా శరన్నవరాత్రి వేడుకలు భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి. సాంస్కృతిక సంబరాలు అలరిస్తున్నాయి. మైసూరులో ప్యాలెస్ ముందు వేదికపై కళాకారుల ప్రతిభ పరవళ్లు తొక్కుతోంది. నృత్యాలు, పాట కచేరీలతో వేలాది ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నారు. మంగళవారం, బుధవారం రాత్రి పొద్దుపోయేవరకూ సంగీత, గానాలాపన తన్మయుల్ని చేసింది. ప్రజలు ఉత్సాహం పట్టలేక వయోభేదం లేకుండా చిందులేస్తూ ఆడిపాడారు.
మడికెరిలో..
కాఫీనాడు మడికెరి సిటీలోని గాంధీ మైదానంలో మంగళవారం రాత్రి దసరా సంబరాలను అట్టహాసంగా ప్రారంభించారు. కళాకారిణి మహిషామర్దిని నృత్యం ప్రజలను ముగ్ధుల్ని చేసింది. గాయకుల పాట కచేరీలు మైమరిపించాయి.
మంగళూరులో
రేవు నగరి మంగళూరులో నవరాత్రుల సందర్భంగా కుద్రోళి గోకర్ణనాథ ఆలయంలో నిత్యం వేడుకలు జరుగుతున్నాయి. శారదా దేవి మండంపంలో భక్తులు దర్శనాలు చేసుకుంటున్నారు. నిత్యం మహాగణపతి, శారద, నవదుర్గల ఆరాధన సాగుతోంది. తుళునాడు సంస్కృతికి అద్దం పట్టేలా సాంస్కృతిక ప్రదర్శనలు జరుగుతున్నాయి.
ప్యాలెస్ వేదిక మీద సినీ పాటల ఆలాపన
మైసూరులో ప్రేక్షకుల కేరింతలు
మైసూరు సహా పలు నగరాల్లో
సంబరాల అట్టహాసం

మది మదిలో దసరా ఉల్లాసం

మది మదిలో దసరా ఉల్లాసం

మది మదిలో దసరా ఉల్లాసం

మది మదిలో దసరా ఉల్లాసం