
బెంగళూరులోని ఆస్పత్రిలో కన్నుమూత
శివాజీనగర: ప్రముఖ కన్నడ సాహితీవేత్త, నాటకరచయిత, తత్వవేత్త, విద్యావేత్తగా పేరుపొంది, సరస్వతి సమ్మాన్ సహా పలు పురస్కారాల గ్రహీత ఎస్.ఎల్.భైరప్ప అస్తమించారు. బెంగళూరులోని రాజారాజేశ్వరి నగరంలో ఉన్న ఓ ఆసుపత్రిలో మతిమరుపు సహా వృద్ధాప్య సమస్యలతో చికిత్స పొందుతున్న భైరప్ప (94) గుండె ఆగిపోవటంతో బుధవారం మధ్యాహ్నం 2.38 గంటలకు కన్నుమూశారు. ఆయన సాహితీ సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్ పురస్కారం అందజేసి గౌరవించింది. 3 రోజుల కిందటే ఆస్పత్రిలో చేరారు.
హాసన్‌లోని పల్లెటూరి నుంచి..
ఆయన రచనల మాదిరిగానే భైరప్ప జీవితం ఎంతో స్ఫూర్తిదాయకమైనది. హాసన్ జిల్లా చన్నరాయపట్టణం సంతేశివరలో 1931, ఆగస్టు 20న భైరప్ప ఓ సాధారణ హొయసళ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ప్రాథమిక విద్యను పూర్తి చేసి మైసూరులో హైస్కూల్, కాలేజీ చదువులను కొనసాగించారు. ప్లేగు వ్యాధి వల్ల చిన్నప్పుడే తల్లి, సోదరులు మరణించారు. పేదరికం వల్ల ఆయన ఇబ్బందులు పడ్డారు. చిన్నా చితకా పనులు చేస్తూ విద్యాభ్యాసానికి డబ్బులు పోగుచేసుకునేవారు. మైసూరు వర్సిటీలో ఫిలాసఫీలో ఎంఏలో గోల్డ్ మెడల్‌ను పొందారు. బరోడాలోని మహారాజ సయ్యాజిరావు విశ్వవిద్యాలయం నుంచి ఫిలాసఫీలో డాక్టరేట్ పట్టాను పొందారు. తరువాత ప్రభుత్వ కాలేజీలో లెక్చరర్‌గా, ప్రొఫెసర్‌గా ఉద్యోగం చేస్తూ రచనా వ్యాసంగంలో విజృంభించారు. ఇంగ్లీషు భాషతో పాటుగా భారతీయ పలు భాషల్లోకి భైరప్ప కావ్యాలు అనువాదమయ్యాయి. ఆయన రచించిన నాటకాలు హిందీ, మరాఠీలోనూ ప్రజాభిమానం పొందాయి.
అసమాన సాహితీవేత్తగా ప్రసిద్ధి
ప్రఖ్యాత కన్నడ సాహితీవేత్తగా ప్రసిద్ధి
ప్రధాని సహా ప్రముఖుల సంతాపం

బెంగళూరులోని ఆస్పత్రిలో కన్నుమూత

బెంగళూరులోని ఆస్పత్రిలో కన్నుమూత

బెంగళూరులోని ఆస్పత్రిలో కన్నుమూత