
ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు
సీతారామ ఆశ్రమంలో అమ్మ వారికి అలంకరణ
హవంబావి ఆశ్రమంలో అమ్మవారికి అలంకరణ
హరిజనవాడలోని
కంచు మారెమ్మ అమ్మవారు
హొసపేటెలో హులిగమ్మ దేవికి ప్రత్యేక అలంకరణ
పూజల్లో పాల్గొన్న రాయచూరు గ్రామీణ ఎమ్మెల్యే బసనగౌడ దద్దల్
బళ్లారిఅర్బన్: విజయదశమి సందర్భంగా దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 3వ రోజు బుధవారం నగరంలోని అమ్మవారి ఆలయాల్లో వివిధ రూపాల్లో అలంకరణ పూజలను నిర్వహించారు. బళ్లారి నగర ఆరాధ్య దైవమైన కనకదుర్గమ్మ ఆలయంలో అమ్మవారికి వెండి ఆభరణాల అలంకరణ, ధార్మిక పూజలను నిర్వహించారు. పటేల్ నగర్‌లో చిన్నదుర్గమ్మ ఆలయంలో, హవంబావి సీతారామ ఆశ్రమంలో, బెంగళూరు రోడ్డు కన్యకా పరమేశ్వరి ఆలయంలో, నగరేశ్వరి ఆలయంలో, బెంకి మారెమ్మ ఆలయంలో, మిల్లర్‌పేట్ మల్నాడు దుర్గమ్మ ఆలయంలో, చిన్న మార్కెట్ శాంభవి దేవి ఆలయంలో, ఫైర్ ఆఫీస్ ఆదిశక్తి ఆలయంలో, సిరుగుప్ప రోడ్డు తుళజా భవాని ఆలయం తదితర అమ్మవారి ఆలయాల్లో నవరాత్రి అలంకరణ పూజలను జరిపారు. ఆలయాలకు 11 రోజుల పాటు విద్యుత్ దీపాలతో అలంకరణలు, హోమ పూజలు నిర్వహించారు.
అన్నపూర్ణేశ్వరీ పాహిమాం
బళ్లారి రూరల్ : దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం నగరంలోని విద్యానగర్ ఆంజనేయస్వామి ఆలయంలో అన్నపూర్ణేశ్వరి మాతకు భక్తులు ఘనంగా పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా అన్నపూర్ణేశ్వరి మాతను పూలతో అలంకరించారు. అమ్మవారికి పుష్పార్చన, కుంకుమార్చన, విశేష పూజలు జరిపారు. అమ్మవారి పూజల్లో మహిళలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ పూజల్లో ఆలయ ప్రముఖులు, స్థానికులు పాల్గొన్నారు.
రాయచూరులో..
రాయచూరు రూరల్ : జిల్లాలో బుధవారం శరన్నవరాత్రి ఉత్సవాలు జరిగాయి. నగరంలోని కిల్లే బృహన్మఠంలో అంబా భవానికి పూజలు జరిపారు. కందగడ్డ మారెమ్మ దేవి, కోటలో కాళికాదేవి ఆలయంలో దేవి, కంచు మారెమ్మ, నగరేశ్వర ఆలయంలో కన్యకా పరమేశ్వరిని, మమదాపురలో మారికాంబ దేవిని ప్రత్యేకంగా అలంకరించారు. నగరంలోని ఉప్పారవాడి లక్ష్మీ వేంకటేశ్వర ఆలయంలో ఆదిశేష వాహనంలో స్వామి వారిని, నగరేశ్వరాలయంలో కన్యకా పరమేశ్వరిని ఊరేగించారు. యాదగిరి నగరసభ అధ్యక్షురాలు లలిత అనపురే, గ్రామీణ ఎమ్మెల్యే బసనగౌడ మమదాపురలో మారికాంబ ఆలయంలో దేవికి ప్రత్యేక పూజలు జరిపారు. శాంతమల్ల శివాచార్య తాయమ్మ దేవికి పూజలు చేశారు.
హొసపేటెలో..
హొసపేటె: శరన్నవరాత్రుల సందర్భంగా మూడవ రోజు బుధవారం నగరంలోని వివిధ వార్డుల్లో వెలసిన అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిట లాడాయి. ఉదయం ఆలయాల్లో అమ్మవారికి విశేష అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదే విధంగా ఉత్తర కర్ణాటకలో ప్రసిద్ధి చెందిన కొప్పళ జిల్లా హులిగి సమీపంలోని హులిగమ్మ దేవి ఆలయంలో అమ్మవారికి పూలమాలతో విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపించారు. ఆలయంలో అమ్మవారికి కుంకుమార్చన, మంగళహారతి తదితర పూజలు చేశారు. భక్తులు ఆలయాలకు వెళ్లి అమ్మవార్లకు మొక్కులు తీర్చుకున్నారు. అదే విధంగా మహిళలు నీలిరంగు చీరకట్టులో ప్రదర్శన ఇచ్చారు.
భక్తిశ్రద్ధలతో ఆలయాల్లో పూజలు
విశేష అలంకరణల్లో అమ్మవార్లు

ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు

ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు

ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు

ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు

ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు

ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు

ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు

ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు