
రోడ్ల గుంతలు పూడ్చడంలో సర్కార్ విఫలం
రాయచూరు రూరల్: కేంద్రంలోని బీజేపీ సర్కార్‌లో రహదారులపై గుంతలు పడలేదా? అని ఉప ముఖ్యమంత్రి డీ.కే.శివకుమార్ పేర్కొనడాన్ని బీజేపీ ఖండించింది. బుధవారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో మాజీ విధాన పరిషత్ సభ్యుడు శంకరప్ప మాట్లాడారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పంచ గ్యారెంటీలకు నిధులు వినియోగించుకొని రోడ్లకు మరమ్మతులు చేపట్టే విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని దూషించడం తగదన్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గుంతలు పడి ప్రజలు పలు ఇబ్బందులకు గురవుతున్నా తమకేమీ పట్టనట్లు వ్యవహరించడం సరికాదన్నారు. ఆందోళనలో శరణమ్మ, ఆంజనేయ, కొట్రేష్, రాఘవేంద్ర, బండేష్, వీరనగౌడ, నాగరాజ్, శ్రీనివాస్, రామచంద్ర, రవీంద్ర జాలదార్, నరసింహులు, రమానంద, విజయ రాజేశ్వరి, సుమా, సంగీతతదితరులు పాల్గొన్నారు.
దాడి నిందితుల
అరెస్ట్‌కు డిమాండ్
రాయచూరు రూరల్: నగరసభ సభ్యుడు జిందప్పపై దాడి చేసిన నగరసభ సభ్యురాలు కవిత భర్త తిమ్మారెడ్డి, మద్దతుదారులను అరెస్ట్ చే యాలని జిల్లా గంగా మతస్థుల సంఘం డిమాండ్ చేసింది. బుధవారం ఎస్పీ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు శాంతప్ప మాట్లాడారు. నగరంలోని ఎల్‌బీఎస్ కాలనీలో తిమ్మారెడ్డి భూమి కొనుగోలు చేశారని, ఈ విషయంలో భూమిని విక్రయించిన వారు తమకు న్యాయం చేయాలని జిందప్ప వద్దకు వెళ్లారని, ఇద్దరి మధ్య చిన్నపాటి వాగ్వాదం చెలరేగి మనస్పర్థలు ఏర్పడ్డాయన్నారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.
సమాజాభివృద్ధికి పిలుపు
రాయచూరు రూరల్: సాంఘీకంగా, ఆర్థికంగా సవితా సమాజం అభివృద్ధి చెందాలని నగరసభ సభ్యుడు జయన్న పేర్కొన్నారు. ఆయన బుధవారం శివ శరణ మాదయ్య భవనంలో జరిగిన పదవీ విరమణ ఉద్యోగుల సహకార సంఘం 6వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించి మాట్లాడారు. నేటిి కాలంలో పిల్లలకు తప్పనిసరిగా చదువు చెప్పించాలన్నారు. డబ్బులను పొదుపుగా వాడుకొనేలా వారికి బుద్ధి చెప్పాలన్నారు. సహకార సంఘం నుంచి రుణాలు పొంది జీవితాలను మెరుగు పరుచుకోవాలన్నారు. కార్యక్రమంలో ఉడుపి నవీన్, చంద్రు బండారి, శ్రీనివాస్, దరేసాబ్, నరసప్ప, దొడ్డ అయ్యప్ప, చంద్రశేఖర్, నరసింహులు, వెంకటేష్, వీరణ్ణ, విజయ్ భాస్కర్, నాగరాజ్, మేనేజర్ గాయత్రిలున్నారు.
తిమరోడిని రాయచూరుకు తరలించవద్దు
రాయచూరు రూరల్: దక్షిణ కన్నడ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ మహేష్‌శెట్టి తిమరోడిని జిల్లా నుంచి తొలగించి రాయచూరు జిల్లా సరిహద్దుల్లో ఉంచాలని జారీ చేసిన ఆదేశాలను ఉపసంహరించుకోవాలని దళిత సేన, సమాన మనస్కుల వేదిక డిమాండ్ చేసింది. బుధవారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకుడు మారుతి బడిగేర్ మాట్లాడారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జిల్లా ప్రజలు తిమరోడిని మాన్వికి పంపకుండా నిరోధించాలన్నారు. ధర్మస్థలలో పుర్రెల గ్యాంగ్ ప్రధాన నిందితుడిపై 32 క్రిమినల్ కేసులు ఉన్నాయన్నారు. నేరారోపణలున్న తిమరోడిని జిల్లాలో అడుగు పెట్టకుండా అడ్డకుంటామన్నారు. రాయచూరు జిల్లాలో హిందూ ముస్లింలు అన్నదమ్ములుగా శాంతియుతంగా జీవిస్తున్న తరుణంలో ఇలాంటి అకృత్యాలు, నేరాలు చేసిన మహేష్ శెట్టి తిమరోడిని జిల్లాకు దూరంగా తరలించాలన్నారు.

రోడ్ల గుంతలు పూడ్చడంలో సర్కార్ విఫలం

రోడ్ల గుంతలు పూడ్చడంలో సర్కార్ విఫలం

రోడ్ల గుంతలు పూడ్చడంలో సర్కార్ విఫలం