
సిటీబస్టాండు ముందు ప్రయాణికుల పాట్లు
బళ్లారి రూరల్: అసలే దసరా నవరాత్రి పర్వదినాలు. నిత్యం రద్దీతో పాటు ఆలయాలను సందర్శించే భక్తులు అధికంగా ఉంటారు. ఈ నేపథ్యంలో రాయల్ సర్కిల్ నుంచి రైల్వే అండర్ బ్రిడ్జ్ వరకు రోడ్లకు ఇరువైపులా డ్రైనేజీ కాలువ నిర్మాణ పనులు చేపట్టి తవ్వడంతో వాహనదారులు, ప్రయాణికులు, భక్తులకు అష్టకష్టాలు తప్పటం లేదు. పైగా ఆర్‌టీసీ, ప్రైవేటు బస్సులు రోడ్డుపైనే ఆపడంతో మరింత ఇబ్బందిగా మారింది. వాహనదారులు ఇటు రాయల్ సర్కిల్, అటు దుర్గమ్మగుడికి వెళ్లాలంటూ ట్రాఫిక్ పద్మవ్యూహం చేధించాల్సిన పరిస్థితి నెలకొంది. డ్రైనేజీ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు సంచారాన్ని సుగమం చేయాలని నగర వాసులు కోరుతున్నారు.
రాయల్ సర్కిల్‌కు, దుర్గమ్మ గుడికి వెళ్ల్లాంటే ట్రాఫిక్ పద్మవ్యూహమే
ఇరువైపులా డ్రైనేజీ కాలువ కోసం గాడి తవ్వడంతో తప్పని తిప్పలు

సిటీబస్టాండు ముందు ప్రయాణికుల పాట్లు