
ఫిరంగుల ఎదుట నిర్భయంగా..
మైసూరు: మైసూరు దసరా వేడుకలలో దసరా రోజున జరిగే జంబూసవారీ బృహత్ వేడుకకు రంగం సిద్ధమవుతోంది. ఆ రోజున ఫిరంగులు పేల్చే సన్నాహాలు ఊపందుకున్నాయి. కెప్టెన్ అభిమన్యు ఆధ్వర్యంలో ఏనుగుల బృందానికి మంగళవారం ముమ్మరంగా తాలీము నిర్వహించారు. 14 గజరాజులు, 30 గుర్రాలను నిలిపి వాటి ముందు వరుసగా ఫిరంగులను పేల్చారు. ఆ భారీ శబ్ధాలకు అలవాటు పడడంతో అవి బెదరకుండా నిలబడ్డాయి. చెవులు చిల్లులు పడే శబ్ధాలు, పెద్దగా పొగ మంటలు వస్తున్నా కూడా ఏనుగులు, అశ్వాలు ఒక్క అడుగు వెనక్కు ముందుకు వేయలేదు. దసరా జంబూసవారీకి తాము సిద్ధంగా ఉన్నామని గరాజులు, అశ్వాలు సంకేతమిచ్చాయి. ఇక ఫిరంగుల తాలీము ముగిసినట్లు అధికారులు తెలిపారు.
మహిళా దసరా షురూ
మహిళలు స్వాభిమానం, సమృద్ధి, సహనం, శక్తికి ప్రతీక, ఈ శక్తికి ప్రతిరూపమే దసరా పండుగ అని మహిళా శిశు సంక్షేమ మంత్రి లక్ష్మీ హెబ్బాల్కర్ అన్నారు. మంగళవారం ఆమె మైసూరు జేకే మైదానంలో మహిళా దసరా సంబరాలను ప్రారంభించి మాట్లాడారు. నవ దుర్గలను పూజించడం, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసే చాముండేశ్వరి దేవిని ఆరాధించడమే విజయదశమి అన్నారు. మైసూరు వర్సిటీలో లక్ష గొంతులతో నాడ గీత ఆలాపన అట్టహాసంగా జరిగింది.
శ్రీరంగపట్టణంలో 25న జంబూసవారీ
మండ్య జిల్లా శ్రీరంగపట్టణంలో సంప్రదాయ దసరా వేడుకలు జరుగుతున్నాయి. అక్కడ ఈ నెల 25వ తేదీన జంబూసవారీ ఊరేగింపు జరుగుతుంది. ఇందుకోసం మైసూరు గజదళం నుంచి మహేంద్ర, కావేరి, లక్ష్మి అనే ఏనుగులను 24న శ్రీరంగపట్టణానికి పంపుతారు. వేడుకలు ముగిసిన తరువాత తిరిగి తీసుకువస్తారని డిసిఎఫ్ ప్రభుగౌడ తెలిపారు.
తాలీములో గజరాజులు
పేలుళ్లకు బెదరని గజాలు, అశ్వాలు
జంబూసవారీకి సిద్ధమని సూచన

ఫిరంగుల ఎదుట నిర్భయంగా..

ఫిరంగుల ఎదుట నిర్భయంగా..

ఫిరంగుల ఎదుట నిర్భయంగా..

ఫిరంగుల ఎదుట నిర్భయంగా..