
శాంతికి భంగం.. తిమరోడికి బహిష్కారం
శివాజీనగర: ధర్మస్థలపై దుష్ప్రచారం కేసుతో పాటు అనేక నేరారోపణలు ఉన్న సామాజిక కార్యకర్త మహేశ్‌శెట్టి తిమరోడిని దక్షిణ కన్నడ జిల్లా నుంచి బహిష్కరణకు జిల్లాధికారులు ఆదేశించారు. శాంతిభద్రతలను కాపాడే దృష్టితో ఆయనను ఓ సంవత్సరం పాటు జిల్లా నుంచి వెలి వేసినట్లు దక్షిణ కన్నడ జిల్లా పుత్తూరు విభాగపు అసిస్టెంట్ కమిషనర్ స్టెల్లా వర్గీస్ ఉత్తర్వుల్ని జారీచేశారు. రాయచూరు జిల్లాలోని మాన్వి తాలూకాలో ఉండాలని కూడా ఆదేశాలిచ్చారు. తిమరోడి ధర్మస్థల సమీపంలోని ఉజిరెలో నివాసం ఉంటున్నారు.
అశాంతిని సృష్టిస్తున్నాడు
తిమరోడి మీద 32కు పైగా కేసులు ఉన్నాయి. చట్ట ఉల్లంఘన, అశాంతి, అస్థిరత సృష్టి కార్యకలాపాల్లో పాల్గొంటున్నందున ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ధర్మస్థల కేసులో ముసుగు మనిషి చిన్నయ్యకు ఆశ్రయమిచ్చిన ఆరోపణ ఉంది. హత్యాచారానికి గురైన సౌజన్య కేసులో పోరాటాల్లో పాల్గొంటున్నారు.
ధర్మస్థల కేసు విచారణ
ధర్మస్థలలో మృతదేహాలను పూడ్చిపెట్టారనే కేసులో పలువురు సాక్షులను బెళ్తంగడి జెఎంఎఫ్‌సీ న్యాయస్థానంలో మంగళవారం పోలీసులు హాజరుపరిచారు. ముసుగుమనిషి చిన్నయ్యను కూడా కోర్టుకు తీసుకువచ్చారు. మొదట్లో చూపించిన తల పుర్రెను ఎక్కడి నుంచి తెచ్చావని చిన్నయ్యను సిట్ అధికారులు విచారించగా చెప్పడం లేదని తెలిపారు.
ధర్మస్థల కేసులో సామాజిక
కార్యకర్తకు దక్షిణ కన్నడ నుంచి వెలి