
వీరశైవ లింగాయతగా రాయించాలి
బళ్లారిఅర్బన్: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కీలకంగా సోమవారం నుంచి ప్రారంభించిన కులగణన ఆర్థిక సామాజిక స్థితిగతుల సర్వే అధ్యయనంలో మతం కాలంలో హిందూ, కులం కాలంలో వీరశైవ లింగాయతగా నమోదు చేయించాలని సమాజ ప్రముఖుడు కేఎం మహేశ్వర స్వామి తెలిపారు. ఆయన స్థానిక మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వానికి కానీ సిద్దరామయ్యకు గాని మతం గురించి తెలుసుకొనే అధికారం లేదు. మతం గురించి కేంద్ర ప్రభుత్వానికే గుర్తించే అధికారం ఉంది. కొందరు వీరశైవగా నమోదు చేస్తే, మరి కొందరు లింగాయతగా నమోదు చేయడం వల్ల పరిగణలోకి తీసుకోవడం కుదరదు. అందువల్ల సమాజ బాంధవులందరూ వీరశైవ లింగాయతగా రాయించాలని కోరారు. షడక్షర స్వామి, ప్రభుస్వామి, పురుషోత్తం గౌడ, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.