
జీఎస్టీ తగ్గింపుపై సంబరాలు
సాక్షి బళ్లారి: దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ సరుకు సేవా పన్ను(జీఎస్టీ)ని తగ్గించడంపై నగరంలో సంబరాలు మిన్నంటాయి. సోమవారం జిల్లా బీజేపీ శాఖ ఆధ్వర్యంలో వందలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ర్యాలీ చేపట్టి కేంద్ర ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుందని హర్షం వ్యక్తం చేస్తూ బాణసంచా పేల్చి స్వీట్లు పంచుకొన్నారు. నగరంలో పలు ప్రధాన వీధుల గుండా ర్యాలీని చేపట్టిన అనంతరం నగర మాజీ ఎమ్మెల్యే సోమశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రధాని తీసుకొన్న నిర్ణయంతో దేశంలో పలు వర్గాలకు మేలు చేకూరుతోందన్నారు. 99 శాతం మేర నిత్యవసరాల ధరలు తగ్గుతాయన్నారు. నవరాత్రి పర్వదిన శుభవేళలో దేశ ప్రజలకు ప్రధాని ఈ కానుకను అందించారన్నారు. కారు కొనుగోలుదారులకు ఏకంగా రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు జీఎస్టీ తగ్గిందన్నారు. అన్ని వర్గాలకు మేలు చేకూర్చే నిర్ణయాన్ని తీసుకోవడంపై ప్రజలు హర్షిస్తున్నారన్నారు. విపక్షాలు అడగకపోయినా, ప్రజలకు భారంగా ఉందని గ్రహించి జీఎస్టీని తగ్గించడం హర్షణీయమన్నారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు అనిల్ కుమార్ మోకా, నగర బీజేపీ అధ్యక్షుడు వెంకటరమణ, బీజేపీ ప్రముఖులు గురులింగనగౌడ, హనుమంతప్ప, తిమ్మారెడ్డి, హుండేకర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ప్రధాని నిర్ణయం.. ప్రజలకు వరం
సిరుగుప్ప: అప్పటి మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ అవధిలో అమలు చేయాలని అనుకొన్న సరుకు సేవా పన్నును 2014లో అమలు చేసి భారత ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టిన ఘనత నరేంద్ర మోదీదని, ఇప్పుడు సామాన్య ప్రజలకు ఇంకా అందుబాటులో ఉండాలనే దృష్టితో జీఎస్‌టీని పలు నిత్యావసర వస్తువులపై తగ్గించి ఎంతో మేలు చేశారని మాజీ ఎమ్మెల్యే ఎం.ఎస్.సోమలింగప్ప ప్రధానిని ప్రశంసించారు. ఆయన నగరంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సామాన్య ప్రజలు ఉపయోగించే నిత్యావసర వస్తువులపై జీఎస్టీని తగ్గించి దసరా పండుగకు కానుకగా ఇచ్చారన్నారు. ప్రపంచ దేశాల్లో భారత్‌ను నాలుగో ఆర్థిక దేశంగా తీర్చిదిద్దిన ఘనత ప్రధానికే దక్కిందన్నారు. తాలూకాలో అన్ని శాఖల్లో పాలన శూన్యమైందన్నారు. ముఖ్యంగా నీటిపారుదల శాఖ ఆఫీసు ఎక్కడ ఉందో తెలియడం లేదన్నారు. ఇక నగరసభ డ్రైనేజ్ వ్యవస్తగా మారిందన్నారు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ పని తీరు చెప్పనలవి కాదన్నారు. పార్టీ నాయకుడు చాగి సుబ్బయ్య శెట్టి, తాలూకా అధ్యక్షుడు మల్లికార్జున స్వామి కుంటనాళ్, బీజేపీ మారెప్ప, ఎం.ఆర్.గౌడ, వీరనగౌడ, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
జీఎస్టీ తగ్గింపుపై హర్షాతిరేకాలు
రాయచూరు రూరల్: కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రజల కష్టాలను అర్థం చేసుకొని జీఎస్టీని తగ్గించిందని శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్ హర్షం వ్యక్తం చేశారు. సోమవారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోందన్నారు. అనంతరం మిఠాయిలు పంచి ఆనందోత్సవం జరిపారు. మాజీ విధాన పరిషత్ సభ్యుడు శంకరప్ప, శరణమ్మ, ఆంజనేయ, కొట్రేష్, రాఘవేంద్ర, బండేష్, వీరనగౌడ, నాగరాజ్, శ్రీనివాస్, రామచంద్ర, రవీంద్ర జాలదార్, నరసింహులు, రమానంద, విజయ రాజేశ్వరి, సుమా, సంగీత పాల్గొన్నారు.
బాణసంచా పేల్చి స్వీట్లు
పంచుకొని కేరింతలు
జిల్లా బీజేపీ శాఖ ఆధ్వర్యంలో
పార్టీ కార్యకర్తల ర్యాలీ

జీఎస్టీ తగ్గింపుపై సంబరాలు

జీఎస్టీ తగ్గింపుపై సంబరాలు