
రియల్ ఎస్టేట్ యజమానిపై దాడి
● బళగానూరు జీపీ అధ్యక్షుడిపై కేసు
రాయచూరు రూరల్: జిల్లాలోని సింధనూరు తాలూకాకు చెందిన రియల్ ఎస్టేట్ యజమాని ఖాజాసాబ్‌పై బళగానూరు జీపీ అధ్యక్షుడు శివకుమార్ నాయక దాడి చేశాడు. నూతనంగా కాలనీ నిర్మాణం చేపట్టడానికి ఫారం నంబర్–3ను అధికారి సత్యనారాయణ కులకర్ణి నుంచి ఖాజాసాబ్ తీసుకునేందుకు ఇంజినీర్ మీనాక్షమ్మ వద్దకు వెళ్లి మాట్లాడుతుండగా అధ్యక్షుడు శివ కుమార్ నాయక ఉన్నఫళంగా వచ్చి రూ.5 లక్షలు లంచం ఇవ్వాలని, లేని పక్షంలో ఫారం ఇవ్వడం కుదరదని చెప్పడంతో ఇద్దరి మద్య వాగ్వాదం జరిగింది. అధ్యక్షుడు శివ కుమార్ నాయక్, సోదరుడు మూకప్ప దుర్భాషలాడి దాడి చేశారు. ఈ ఘటనపై బళగానూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
చెట్లు మనిషి ఆరోగ్యానికి ప్రాణాధారం
రాయచూరు రూరల్: చెట్లు మనిషి ఆరోగ్యానికి ఆక్సిజన్ వంటివని నగరసభ సభ్యుడు జయన్న పేర్కొన్నారు. సోమవారం పవన్ కాలనీలో మొక్కలు నాటి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ అధిక శాతం చెట్ల కింద కూర్చొని సేద తీరుతారన్నారు. చెట్ల నుంచి వచ్చే గాలిని పీల్చుతుంటారన్నారు. ప్రతి ఒక్కరూ ఇంటి ముందు చెట్లు పెంచి పర్యావరణాన్ని సంరక్షించాలన్నారు. జయ ప్రకాష్ పాటిల్, బసవరాజ్ పాటిల్, సకలేస్ పాటిల్, అమరేష్, హన్మంత రాయ, మహంతేష్, విశ్వనాథ్ పాల్గొన్నారు.
యువత వ్యవసాయంపై
దృష్టి పెట్టాలి
రాయచూరు రూరల్: రాష్ట్ర యువతీ యువకులు వ్యవసాయంపై దృష్టి పెట్టాలని సినీ తార, సీఎంఆర్ రాయబారి సప్తమిగౌడ అభిప్రాయ పడ్డారు. సోమవారం సీఎంఆర్ దుకాణాన్ని ప్రారంభించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. నేటి ఆధునిక సమాజంలో యువతీ యువకులు చెడు అలవాట్లకు గురై జీవితాలను చెడగొట్టుకుంటున్నారన్నారు. మరో వైపు కుటుంబంలో మహిళల నుంచి వస్తున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని భారతీయ సనాతన సంస్కృతి, ఆచార విచారాలు సంప్రదాయాలు కనుమరుగు కాకుండా కాపాడుకోవచ్చన్నారు. ఇటీవల తిరిగి పూర్వ వైభవం సంతరించుకోవడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నట్లు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల్లో 40 శాఖలను ప్రారంభించారన్నారు.
అంబేడ్కర్ విగ్రహ
నిర్మాణాలు పూర్తి చేయరూ..
రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం రూ.12 లక్షలతో చేపట్టిన అంబేడ్కర్ విగ్రహ నిర్మాణాలు సత్వరం పూర్తి చేయాలని దేవదుర్గ సమాజ సేవకుడు అళ్లప్ప డిమాండ్ చేశారు. సోమవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2023లో నిర్మాణానికి శ్రీకారం చుట్టినా నేటికీ పనులు పూర్తి చేయకుండా అధికారులు నిరక్ష్యం వహిస్తున్నట్లు తెలిపారు. శాసన సభ్యురాలు కరెమ్మ ఈ విషయంలో ఏనాడూ అధికారులతో చర్చించలేదన్నారు. నగరసభ అధికారి హంపయ్య, ఇంజినీర్లు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తూ పనులు పెండింగ్‌లో ఉంచారన్నారు. పనులు చేయని అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు లేఖ రాయనున్నట్లు తెలిపారు.
అంగన్‌వాడీలకు
వెట్టి చాకిరీ వద్దు
రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీ కార్యకర్తలను వెట్టి చాకిరీ నుంచి తొలగించాలని అంగన్‌వాడీ కార్యకర్తల సంఘం డిమాండ్ చేసింది. సోమవారం మహిళా శిశు సంక్షేమ శాఖాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో జిల్లాధ్యక్షురాలు పద్మ మాట్లాడారు. కేంద్రాల్లో విధులు నిర్వహించే కార్యకర్తలకు కేటాయించిన ముఖ గుర్తింపు పద్ధతి(ఎఫ్‌ఆర్‌ఎస్)ని తొలగించాలని, ఎఫ్‌ఆర్‌ఎస్‌ను అమలు చేయడం వల్ల అంగన్‌వాడీ కార్యకర్తలు పలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం తీసుకున్న, జారీ చేసిన ఎఫ్‌ఆర్‌ఎస్‌ను రద్దు చేయాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు.

రియల్ ఎస్టేట్ యజమానిపై దాడి

రియల్ ఎస్టేట్ యజమానిపై దాడి