
అసమానతలకు చరమగీతం పాడదాం
బళ్లారి అర్బన్: శ్రమిక వర్గాలు సంపద యజమానులుగా ఎదిగితేనే సమాజంలో అసమానతలకు చరమగీతం పలకవచ్చని ఎస్‌యూసీఐ కమ్యూనిస్ట్ పోలిట్ బ్యూరో సభ్యుడు కామ్రేడ్ కె.రాధకృష్ణ తెలిపారు. విద్యా, సంస్కృతి, మానవత, పరిరక్షణ నినాదంతో స్థానిక బలిజ భవన్‌లో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి కార్యకర్తల అధ్యాయన శిబిరంలో రెండు రోజు సమాజ పరివర్థన యళ్లి విద్యార్థుల యాత్ర గురించి మాట్లాడారు. పీడిత, తాడిత పెట్టుబడి దారి వ్యవస్థలో కుల, మత, భాష, జాతి, విభజనల ద్వారా ప్రజల్లో అనైక్యత సృష్టించారన్నారు. సాధారణ ప్రజలు ఎదుర్కొంటున్న ఆకలి, పేదరికం, నిరుద్యోగం, విద్య, వ్యాపారంగా మారిన సామాజిక సమస్యలు కేవలం ఓ మతం, కులానికి పరిమితం కాలేదు. అన్ని కులాల మతాల నిరుపేదలు ఈ సమస్యల వలయంలో చిక్కుకున్నారని తెలిపారు. పీడిత తాడిత వ్యవస్థను అంతం చేసి సమాజ వాదాన్ని నెలకొల్పినప్పుడే అసమానతలకు చరమగీతం పలకవచ్చన్నారు. అన్ని సమస్యలకు పరిష్కరం చూపవచ్చని వెల్లడించారు. కార్యక్రమంలో ఆ సంస్థ ప్రముఖులు కళ్యాణ కుమార్ అశ్విన్, అజయ్ కామత్, అభయ దివాకర, తదితరులు పాల్గొన్నారు.