
వాల్మీకుల సమావేశం బహిష్కరణ
హొసపేటె: కురుబ సమాజ సోదరులను ఎస్టీ జాబితాలో చేర్చాలన్న రాష్ట్ర ప్రభుత్వ చర్యను ఖండిస్తూ జిల్లాధికారి కార్యాలయ హాలులో ఏర్పాటు చేసిన మహర్షి వాల్మీకి నాయక సమావేశాన్ని ఆ సమాజ బాంధవులు బహిష్కరించారు. అక్టోబర్ 7న జరగనున్న మహర్షి వాల్మీకి జయంతి వేడుకల నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం జిల్లాధికారి కార్యాలయ హాలులో జిల్లాధికారిణి కవితా మన్నికేరి అధ్యక్షతన ముందస్తు జయంతి సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశం ప్రారంభంలో మాట్లాడుతూ గురువారం దావణగెరెలో రాజనహళ్లిలోని వాల్మీకి గురుపీఠంలో డాక్టర్ ప్రసన్నానందపురి స్వామీజీ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర స్థాయి వాల్మీకి సమాజ సమావేశంలో కురుబ, ఇతర వర్గాలను ఎస్టీ జాబితాలో చేర్చాలనే ప్రభుత్వ చర్యను తీవ్రంగా వ్యతిరేకించినట్లు తాలూకా వాల్మీకి నాయక సమాజ అధ్యక్షుడు గోసల భరమప్ప అన్నారు. రాష్ట్ర స్థాయి సమావేశం నిర్ణయం ప్రకారం వాల్మీకి సమాజం సెప్టెంబర్ 25న రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శన నిర్వహించి ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పిస్తుందన్నారు. తాలూకా వాల్మీకి సమాఖ్య ప్రధాన కారదర్శి దేవరమణి శ్రీనివాస్, నాయకులు డాక్టర్ పన్నంగధర్, కిషోర్ కుమార్, కిచిడి శ్రీనివాస్, దురుగప్ప పూజారి, గుజ్జల చంద్రశేఖర్, బిసాటి తాయప్ప నాయక, బండే శ్రీనివాస్, ఎస్‌ఎస్ సంఘం నాయకులు గుజ్జల శ్రీనాథ్, కన్ని శ్రీకాంత, జంబానల్లి వసంత్, జంబానల్లి సత్యనారాయణ, కటిగి రామకృష్ణ, నాణికేరి వెంకోబ తదితరులు పాల్గొన్నారు.