వర్షాకాలం.. ఇళ్లకు ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

వర్షాకాలం.. ఇళ్లకు ప్రమాదం

Sep 20 2025 6:28 AM | Updated on Sep 20 2025 7:00 AM

సాక్షి బెంగళూరు: రోజంతా కష్టపడి ఇంటికి వచ్చి కాస్తా సేద తీరితే ఆ తృప్తే వేరు.. బయట ఎన్ని పనులున్నా, ఎక్కడున్నా చివరికి ఇంటికి చేరితే ఎంతో నెమ్మది, ఆహ్లాదంగా ఉంటుంది. అలాంటి ఇల్లు అకాల వర్షాలకో, వరదలకో నేలకొరిగిపోతే సగటు మనిషి జీవితం కూలిపోయినట్లుగానే అనిపిస్తుంది.. ఇలా 2019–2020 నుంచి రాష్ట్రంలో అతివృష్టి, వరదల కారణంగా ఇళ్లు కోల్పోయిన బాధితులకు ఇప్పటికీ సరైన నివాసం లేకపోవడం గమనార్హం. ఇలా రాష్ట్రంలో అతివృష్టి కారణంగా ఇళ్లు కోల్పోయిన బాధిత కుటుంబాల సంఖ్య సుమారు 3 లక్షలకు పైగానే ఉంది. వీరందరికి ఇప్పటివరకు సరైన పరిహారం, ఉండేందుకు నివాసం కల్పించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలం అయ్యాయి.

పరిహారం సరిగా అందక....

అత్యధిక వర్షాలు, నది ప్రవాహాలతో పాటు స్థానికంగా వాగులు, వంకలు పొంగి ప్రవహించడంతో ప్రతి ఏటా ఆయా గ్రామాలు, పట్టణాల్లో ఇళ్లకు నష్టం చేకూరుతోంది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు పరిహారం ప్రకటిస్తున్నా, కొన్ని కారణాలతో సకాలంలో పరిహారం లభించక బాధితులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం ఇచ్చి పరిహారం ఇల్లు నిర్మించేందుకు సరిపోవడం లేదని కన్నీరు పెడుతున్నారు. 2019–2020 నుంచి 2024–2025 వరకు రాష్ట్రంలో ఇలా 2.86 లక్షల ఇళ్లకు అతివృష్టి, వరదలు, నదీ ప్రవాహాల కారణంగా నష్టం వాటిల్లింది. ఈ ఏడాది కురుస్తున్న వర్షాలకు మరిన్నీ ఇళ్లు కూడా ధ్వంసమయ్యాయి. అతివృష్టి నష్టాన్ని నివారించేందుకు రాష్ట్రంలో 2019లో ‘వరద బాధితుల పునర్వసతి పథకాన్ని’ రూపొందించారు. ఈ పథకం కింద ఎన్‌డీఆర్‌ఎఫ్‌ కింద ఆర్థిక సాయంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా పరిహారం అందిస్తోంది. బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పూర్తి ఇల్లు నాశనం అయితే రూ. 5 లక్షల పరిహారం ఇచ్చారు. ప్రస్తుత కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ పరిహారం రూ. 1.20 లక్షలతో పాటు వసతి యోజన కింద ఒక ఇల్లు నిర్మాణం కూడా చేస్తున్నారు.

ఐదేళ్లలో అతివృష్టి కారణంగా ఇళ్లకు నష్టం

రాష్ట్రంలో మూడు లక్షలు దాటిన వరద బాధితులు

జీపీఎస్‌ పూర్తి కాక అవస్థలు

బాధితులకు పరిహారాన్ని ఇల్లు నిర్మాణ దశ ఆధారంగా జీపీఎస్‌ చేసి పంపిణీ చేస్తున్నారు. నిర్మాణ దశ సమయంలో సరిగ్గా జీపీఎస్‌ అవ్వని కారణంగా ప్రస్తుతం పరిహారం అందడం లేదని గ్రామ పంచాయతీ సిబ్బంది, బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ఇళ్లు సగం వరకు నష్టపోవడంతో అలాంటి బాధితులకు రూ. 50 వేలు, పూర్తిగా నాశనం అయితే రూ. 1.20 లక్షలు ఇస్తున్నారు. దీనికితోడు ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ పరిహారం ద్వారా పునాదులు నిర్మించడం కూడా వీలుపడడం లేదు. కొన్ని చోట్ల పరిహారం సరిగ్గా అందకపోవడంతో సగంలోనే ఇంటి నిర్మాణాలు నిలిచిపోయాయి. ప్రస్తుతం మూడు దశల్లో ఇంటికి కలిగిన నష్టాన్ని లెక్కిస్తున్నారు. 75 శాతం కంటే ఎక్కువగా ఇంటికి హాని కలిగితే పూర్తి నష్టంగా, 25 శాతం నుంచి 75 శాతం హాని కలిగితే ఒకరకమైన నష్టంగా, 15 శాతం నుంచి 25 శాతం నష్టం వాటిల్లితే అల్ప నష్టంగా పరిగణిస్తున్నారు. ఇలా ప్రస్తుతం మూడు లక్షలకు పైగా ఇళ్లకు హాని కలిగినట్లు అంచనా వేశారు.

వర్షాకాలం.. ఇళ్లకు ప్రమాదం 1
1/5

వర్షాకాలం.. ఇళ్లకు ప్రమాదం

వర్షాకాలం.. ఇళ్లకు ప్రమాదం 2
2/5

వర్షాకాలం.. ఇళ్లకు ప్రమాదం

వర్షాకాలం.. ఇళ్లకు ప్రమాదం 3
3/5

వర్షాకాలం.. ఇళ్లకు ప్రమాదం

వర్షాకాలం.. ఇళ్లకు ప్రమాదం 4
4/5

వర్షాకాలం.. ఇళ్లకు ప్రమాదం

వర్షాకాలం.. ఇళ్లకు ప్రమాదం 5
5/5

వర్షాకాలం.. ఇళ్లకు ప్రమాదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement