
ఆరోగ్యంపై మహిళలు శ్రద్ధ వహించాలి
హొసపేటె: ఆరోగ్యంపై మహిళలు శ్రద్ధ వహించాలని వైద్యురాలు దివ్యశ్రీ సూచించారు. శుక్రవారం తాలూకాలోని గదిగనూర్ గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్వస్థ నారి సశక్త పరివార్ అభియాన్‌లో భాగంగా ఆరోగ్యకరమైన మహిళలు, బలమైన కుటుంబాలు అనే ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆర్యోగాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల మహిళలు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రభుత్వ ఆరోగ్య సేవలను సక్రమంగా పొందేందుకు ప్రచారం ద్వారా అవగాహన కల్పించడం జరుగుతోందన్నారు. మహిళలు చెవి, కన్ను, ముక్కు, గొంతు, రక్తపోటు, క్యాన్సర్–నోరు, రొమ్ము, గర్భాశయ పరీక్ష, టీకా సేవలు, రక్తహీనత స్థాయి, క్షయ తదితర వ్యాధులకు వైద్య సేవలు పొందవచ్చని తెలిపారు. ఆరోగ్యకరమైన సీ్త్ర తన మొత్తం కుటుంబం యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి స్వస్థ్ నారి, సశక్తి పరివార్ అభియాన్ ప్రారంభించబడిందన్నారు. ఆరోగ్య విద్య అధికారి ఎంపీ దొడ్డమణి మాట్లాడుతూ.. మాతృ వందన యోజన రిజిస్ట్రేషన్, అవయవ దాన రిజిస్ట్రేషన్, రక్తదాన శిబిరాలు, బుతు పరిశుభ్రత, పోషకాహారంపై అవగాహన తదితర సేవలను పొందేందుకు వీలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఈ సేవలను పొందడానికి ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రం, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రం లేదా అంగన్‌వాడీలను సంప్రదించాలని సూచించారు.