
సహకార సంఘాలు రైతుల పరపతి పెంచాలి
మాలూరు: సహకార సంఘాలు రాజకీయాలకు దూరంగా ఉంటూ అన్నదాతలకు అండగా నిలవాలని ఎమ్మెల్యే కేవై నంజేగౌడ అన్నారు. నగరంలోని తిరుమల కళ్యాణ మంటపంలో తాలూకా ప్రాథమిక సహకార వ్యవసాయ సహకార, గ్రామీణ అభివృద్ధి బ్యాంకు ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన 2024–25 సంవత్సర సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కోలారు చిక్కబళ్లాపురం జిల్లాల పైకి పీల్‌డీ బ్యాంకు రైతులకు అధిక రుణాలు ఇవ్వడం, 82 శాతం రికవరీ చేయడం గొప్ప విషయమన్నారు. సహకార సంస్థలు రైతుల పరంగా పనిచేయాలన్నారు. సహకార సంస్థల ద్వారానే రైతుల అభివృద్ధి సాధ్యమన్నారు. రైతులు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించి బ్యాంకు విశ్వాసం పొందాలన్నారు. బ్యాంకు అధ్యక్షుడు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు వెంకటేశప్ప, డైరెక్టర్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.