
అంధ జంటకు వివాహోత్సవం
మాలూరు: ఇద్దరికీ చూపు లేదు, బతుకంటే చీకటి తప్ప మరొకటి తెలియదు, అయినప్పటికీ కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. దొడ్డకల్లహళ్లి గ్రామంలో అంధ జంటకు ఘనంగా పెళ్లయింది. గ్రామానికి చెందిన నారాయణమ్మ, రాయచూరు జిల్లా యరమరస్‌కు చెందిన రంగప్ప వధూవరులు. నారాయణమ్మ పుట్టుకతో అంధురాలు, చిన్నప్పుడే తల్లిదండ్రులు మరణించారు. హొంబాళప్ప, లక్ష్మమ్మ అనే దంపతులు నారాయణమ్మను చేరదీసి అనాథ అనే భావన రాకుండా పెంచారు. వీరికి పిల్లలు లేకపోవడం వల్ల ఆమే కూతురైంది. పెళ్లీడు రావడంతో సంబంధాలు వెతకసాగారు. యరమరస్‌వాసి రంగప్ప కూడా అంధుడు, వారి పెద్దలతో మాట్లాడి వధువు ఇంట ఘనంగా మూడుముళ్ల వేడుకను జరిపించారు. స్థానిక ప్రముఖుడు హూడి విజయకుమార్ పెళ్లికి ఆర్థిక సహాయం అందించారు. ఇరు కుటుంబాల బంధువులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
దసరా చిత్రోత్సవం షురూ
మైసూరు: మైసూరు దసరా ఉత్సవాలలో భాగమైన చలన చిత్రోత్సవాలను శనివారం మాల్ ఆఫ్ మైసూరులోని కింది అంతస్తులో ప్రారంభించారు. మంత్రి హెచ్‌సి మహాదేవప్ప మాట్లాడుతూ సమాజంలో అన్ని వర్గాల ఆదరణను చూరగొన్న అత్యంత ప్రభావవంత రంగం సినిమాలేనన్నారు. రచనలు, సంగీతం, సాహిత్యం సినిమాలలో కనిపిస్తాయని, ప్రజలు కూడా ఎంతో ఆదరిస్తారని చెప్పారు. దివంగత అలనాటి నటి బీ.సరోజాదేవి దక్షిణ భారత దేశంలో ఒక లేడీ సూపర్‌స్టార్ అని కొనియాడారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలురంగాల ప్రముఖులను సన్మానించారు. నిత్యం పలు సినిమాల ప్రదర్శనలు జరుగుతాయి.
టౌన్‌షిప్‌పై రైతుల భగ్గు
దొడ్డబళ్లాపురం: రామనగర తాలూకా బిడదిలో ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ కోసం ప్రభుత్వం చేపడుతున్న భూసేకరణను వ్యతిరేకిస్తూ కంచుగారనహళ్లి గ్రామం రైతులు భైరమంగల సర్కిల్‌లో నిరవధిక నిరసనకు దిగారు. భూసేకరణ కోసం చేపట్టిన జేఎంసీ సర్వే పనులను అడ్డుకున్నారు. టౌన్‌షిప్ కోసం ప్రభుత్వం 9 వేల ఎకరాలను భూ సేరణ చేయనుంది, వందలాది మంది రైతులకు భూములు ఇచ్చేయాలని నోటీసులు జారీచేస్తోంది. అయితే ఈ టౌ న్‌షిప్ వల్ల స్థానిక రైతులకు ఒరిగేదేమే లేదని వారు మండిపడ్డారు. ప్రాణాలకు తెగించి అయినా భూములను రక్షించుకుంటామని అన్నారు.

అంధ జంటకు వివాహోత్సవం

అంధ జంటకు వివాహోత్సవం