
గజముఖా.. ఇక వీడ్కోలు
● తుమకూరులో నిమజ్జనోత్సవం
తుమకూరు: తుమకూరు నగరంలోని బీజీఎస్ సర్కిల్‌లో ఉన్న నాగరకట్టెలో ప్రతిష్టించిన హిందూ మహాగణపతి నిమజ్జన వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. భారీ వాహనంలో గణనాథున్ని ఉంచి ఊరేగింపును ప్రారంభించారు. సిద్దగంగా మఠాధిపతి సిద్దలింగస్వామి, వివిధ మఠాల స్వాములు, స్థానిక ప్రముఖులు ఏకదంతునికి పూజలు చేసి ప్రారంభించారు. అక్కడి నుంచి నగరంలో ఉన్న ప్రముఖ వీధుల గుండా కళా ప్రదర్శనలు, బ్యాండు బాజాలతో ఊరేగింపు సాగింది. వేడుకలో ఏనుగు కూడా పాల్గొంది. చెరువులో విగ్రహాన్ని వదిలారు.

గజముఖా.. ఇక వీడ్కోలు