
డ్రగ్స్ వ్యాపారానికి ఖాకీల సహకారం
బనశంకరి: సిలికాన్ సిటీలో చాపకింద నీరులా గంజాయి, డ్రగ్స్ విక్రయాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. ప్రతి నెలా పెద్ద మొత్తంలో పట్టుబడుతున్నాయి. కానీ కొందరు పోలీసులే మత్తు భూతానికి సహకరిస్తున్నట్లు తేలింది. డ్రగ్స్ విక్రేతలతో కుమ్మకై ్కన ఎస్‌ఐ, 10 మంది పోలీసులను బెంగళూరు నగర పోలీసు కమిషనర్ సీమంత్‌కుమార్ సింగ్ శనివారం సస్పెండ్ చేశారు. చామరాజపేటె ఠాణా ఎస్‌ఐ టీ.మంజణ్ణ, అదే ఠాణాలో నలుగురు పోలీసులు ఇందులో ఉన్నారు.
ఇలా వెలుగుచూసింది
గత నెలలో 6 మంది డ్రగ్ పెడ్లర్లను రాజరాజేశ్వరినగర పోలీస్‌స్టేషన్ పరిధిలో అరెస్ట్‌చేశారు. వారిని విచారిస్తుండగా డ్రగ్స్ అమ్మకాలు, డబ్బు పంపిణీ గురించి కొందరు పోలీసులు చేసిన మెసేజ్‌లు, ఆడియోలు లభ్యమయ్యాయి. అంతేగాక డ్రగ్ పెడ్లర్లతో కలిసి పోలీసులు చెట్టాపట్టాలు వేసుకుని పార్టీలు చేసుకున్న ఫోటోలు మొబైళ్లలో లభ్యమైయ్యాయి. ఏసీపీ భరత్‌రెడ్డి, డీసీపీ గిరీశ్ విచారణ సాగించారు. డ్రగ్స్ విక్రేతలతో ఆ పోలీసులు మామూళ్లు తీసుకుంటున్నట్లు తేలింది. ఆ డబ్బును తమ బంధువుల ఖాతాల్లోకి వేయించేవారు. డ్రగ్ పెడ్లర్లు ప్రతినెలా రూ.1.5 లక్షల నుంచి రూ. 2 లక్షల వరకు మామూళ్లు తీసుకున్నట్లు డీసీపీ విచారణలో వెల్లడైంది. డీసీపీ నివేదిక ప్రకారం కమిషనర్ చర్యలు చేపట్టారు. కాగా సిలికాన్ సిటీలో డ్రగ్స్ దందాకు కొందరు పోలీసుల సహకారం ఉందని ఆరోపణలున్నాయి. ఎవరెవరు మత్తు పదార్థాలను అమ్ముతారో పోలీసులకు అంతా తెలుసని, కానీ మామూళ్లు తీసుకుంటూ బాగా వెనకేసుకుంటున్నారని, డ్రగ్స్‌కు అమాయకులే బలవుతున్నారని మరోసారి స్పష్టమైంది.
ప్రతి నెలా రూ.లక్షలాది మామూళ్లు
బెంగళూరులో బయటపడిన గుట్టు
ఎస్‌ఐ సహా 11 మంది సస్పెండ్