బళ్లారిఅర్బన్: గ్రామీణ బ్యాంక్‌లను విలీనం చేసి దేశంలో ఒకే గ్రామీణ బ్యాంక్‌ను ఏర్పాటు చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) అన్ని గ్రామీణ బ్యాంక్‌లను కలిపి జాతీయకరణం చేసి నేషనల్ రూరల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎన్‌ఆర్‌బీఐ)ను ఏర్పాటు చేయాలని ఏఐఆర్‌ఆర్‌బీఈఏ ప్రధాన కార్యదర్శి ఎస్.వెంకటేశ్వర రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం కేజీబీ ఉద్యోగుల సమాఖ్య, కేజీబీ అధికారుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో పాత కోర్టు రోడ్డులోని కమ్మ భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు కేజీబీ కర్ణాటక వికాస బ్యాంకులు విలీనమై 2025 మే 1 నుంచి కేజీబీగా సేవలు ప్రారంభించడం అందరికీ తెలిసిందేనన్నారు. ఈ మేరకు సంబంధిత అధికారుల సంఘం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ ప్రత్యేక సమావేశానికి రాష్ట్రంలోని ప్రతి జిల్లా నుంచి విచ్చేసిన అందరికీ ఆయన ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆయా సంఘాల ప్రముఖులు శ్రీకాంత్, నాగభూషణ, కాగినెలె, గణపతి హెగ్డే తదితరులు పాల్గొన్నారు.