
నిండుగా భద్ర జలాశయం
శివమొగ్గ: జిల్లాలోని భద్ర డ్యాం తొణికిసలాడుతోంది. పూర్తిగా నింపడానికి ఇంకా 15 అడుగులు మాత్రమే బాకీ ఉంది. సోమవారం ఉదయం నాటికి నీటి మట్టం 171 అడుగులకు చేరింది. డ్యాం గరిష్ట స్థాయి 186 అడుగులు. ఇన్‌ఫ్లో 20,626 క్యూసెక్కులు ఉంటే, 5,198 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. గత సంవత్సరం ఇదే రోజు ఆనకట్ట నీటి మట్టం 131.10 అడుగులు మాత్రమే ఉండింది. ఈసారి వర్షాలు ముందే కురవడంతో ప్రవాహం ఇనుమడించింది. జిల్లాలో ప్రధాన జల విద్యత్ ఉత్పత్తి కేంద్రమైన లింగనమక్కి జలాశయం కూడా గరిష్టస్థాయికి చేరుకొంది. వర్షం తగ్గడంతో తుంగ, భద్ర, లింగనమక్కి డ్యాంలకు ఇన్‌ఫ్లో స్వల్పంగా తగ్గింది.