
రోడ్లు కావాలంటే గ్యారంటీలు బంద్ చేయాలి
సాక్షిబళ్లారి: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఐదుఉ గ్యారెంటీ పథకాల వల్ల అభివృద్ధి పనులకు నిధుల కొరత ఏర్పడినట్లు కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే, సీఎం ఆర్థిక సలహదారుడైన బసవరాజ్ రాయరెడ్డి అన్నారు. రాయరెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో పడేసే సూచనలు కనిపిస్తున్నాయి. కొప్పళ జిల్లా కుక్కనూరు తాలూకా యర్వనికలో హైస్కూల్ భవన కట్టడ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. తమ పొలాలనికి రోడ్డు నిర్మించాలని ఓ రైతు విజ్ఞప్తి చేయగా ఆయన పైవిధంగా స్పందించారు. బియ్యం వద్దు, గృహలక్ష్మి వద్దంటే ఆ డబ్బుతో అభివృద్ధి పనులను చేపడుదాం. రోడ్లు బాగుపడాలంటే బియ్యంతో పాటు అన్ని గ్యారెంటీలు బంద్ అవుతాయని పేర్కొన్నారు. రోడ్డు కావాలంటే బియ్యం తదితరాలు బంద్ చేయాలని ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు సలహా ఇస్తానని ఆయన సూచించారు. సాక్షత్తు సీఎం సలహాదారుడైన బసవరాజ రాయరెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. కాగా రాయరెడ్డి వ్యాఖ్యలపై సీఎం సిద్దరామయ్య స్పందిస్తు గ్యారెంఈ పథకాలు మార్చే ప్రశక్తే లేదన్నారు. ఇవి పేదల సంక్షేమానికి సంబంధించిన కార్యక్రమాలని అన్నారు.
ప్రభుత్వాన్ని ఇరుకున పడేసిన బసవరాజ్ రాయరెడ్డి వ్యాఖ్యలు