
నకిలీ రికార్డులతో ఆస్తుల విక్రయాలు
రాయచూరు రూరల్: దళారులు, అధికారులు కుమ్మక్కై ప్రజల ఆస్తులకు నకిలీ రికార్డులు సృష్టించి విక్రయించి భారీ కుంభకోణానికి తెరదీశారు. దీంతో నగరంలో అస్తులు కలిగిన వారు నగరసభ కార్యాలయానికి వెళ్లి అస్తులు తమపేరు మీద ఉన్నాయో, లేదో అని చూసుకుంటున్నారు. అక్రమార్కులు ప్రజల ఆస్తులకు సంబంధించిన పత్రాల నకళ్లను సేకరించి వాటిని ఒరిజనల్‌గా చూపుతూ ఇళ్ల స్థలాలను అమాయకులకు కట్టబెట్టారు. రాయచూరు, సిరివార, లింగసూగురు తాలుకాలో ఇలా అనేక మందికి చెందిన ఆస్తులకు నకిలీ రికార్డులు సృష్టించారు. బాధితుల ఫిర్యాదుతో 36 మందిపై పోలసులు కేసు నమోదు చేశారు. అంజినేయ్య, సంతోష్ శాన్బోగ, సబ్ రిజిస్ట్రార్, ఎఫ్‌డీపీ నారాయణ, రాజు, నగరసభ యస్డీసీ నరసింహులు, డి,డి,రైటర్ లోక్‌నాథ్ రెడ్డి, రామప్ప, మారెప్ప, ప్రసాద్, మసూదవలీ, అక్షయ్ భండారి, మహ్మద్ ముజాయిద్, విద్యా సురేస్ తదితరులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. దీనిపై విచారణకు కమిటీని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. వారం రోజుల్లో నివేదికలు అందించాలని అదేశించినట్లు వివరించారు.
రాయచూరు జిల్లాలో భారీ కుంభకోణం
36 మందిపై కేసులు

నకిలీ రికార్డులతో ఆస్తుల విక్రయాలు