
ఆయుర్వేద శిబిరాల నిర్వహణ అభినందనీయం
రాయచూరు రూరల్: నగరంలోని పూర్ణిమ అయుర్వేద వైద్య కళాశాల భవనంలో శనివారం రస కౌశల్య శిబిరాలను ఏర్పాటు చేశారు. శిబిరాలను రాజీవ్‌గాంధీ ఆరోగ్య వర్సిటీ ప్రిన్సిపాల్ బీఏస్ సవడి ప్రారంభించి మాట్లాడారు. వర్సిటీ ఆవరణలో 250 ఔషధ మొక్కలు నాటి పంచకర్మ తదితర ఆయుర్వేద విధానాలతో రోగులకు వైద్యం అందిస్తుండటం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో అయుర్వేదం ద్వారానే అన్ని రోగాలకు మందులు లభిస్తాయన్నారు. కార్యక్రమంలో కేశవ రెడ్డి, శివకుమార్, ఆయూష్ అధికారి శంకర గౌడ, మహేశ్వర స్వామి, పూర్ణిమ అయుర్వేద వైద్య కళాశాల ప్రిన్సిపాల్ చంద్ర శేఖర్ రెడ్డి, వైద్యులు నందా, అంబిక, ప్రత్యూష, బసవరాజ్ పాల్గొన్నారు.