
కళ్యాణ కర్ణాటకను కరుణించని వరుణుడు
రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటకలో కరువు పరిస్థితులు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఖరీప్ సీజన్ ఆరంభమై నెల రోజలు గడిచినా చుక్కవాన లేదు. దీంతో రైతులు నిత్యం ఆకాశం వైపు చూస్తున్నారు. ఎటు చూసినా ఖాళీ భూములు దర్శనం ఇస్తున్నాయి. కళ్యాణ కర్ణాటకలో కొప్పళ, బీదర్, యాదగిరి, కలబుర్గి, రాయచూరు జిల్లాలు ఉన్నాయి. వర్షాభావంతో విత్తనమే పడలేదు. రైతులు విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉంచుకొని వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. ఎక్కడా మేఘాల జాడ కూడా కనిపించకపోవడంతో అన్నదాతలు నిర్వేదంతో ఉన్నారు. రాయచూరు జిల్లాలో 5.4 లక్షల హెక్టార్లలో విత్తనం పడాల్సి ఉండగా ఇప్పటివరకు 25వేల హెక్టార్లో మాత్రమే విత్తనం చేశారు. పత్తి, కంది, సూర్యకాంతి, సజ్జ పంటలు అక్కడక్కడ సాగయ్యాయి. వర్షం లేక అవికూడా మొక్కలు వాడుముఖం పట్టాయి. విత్తనం వేయని రైతులు వరుణుడి కటాక్షం కోసం ఎదురు చూస్తున్నారు.
ఖరీఫ్‌లో వర్షాలు శూన్యం
అన్నదాతల్లో నిర్వేదం
బీళ్లతను తలపిస్తున్న పొలాలు

కళ్యాణ కర్ణాటకను కరుణించని వరుణుడు

కళ్యాణ కర్ణాటకను కరుణించని వరుణుడు