
అతిథి అధ్యాపకులపై జీఓని రద్దు చేయాలి
బళ్లారిఅర్బన్: అతిధి లెక్చరర్లకు విధుల పెంపుతో పాటు మిగిలిన అదనపు పని భారాన్ని కొత్త వారికి కౌన్సెలింగ్ ద్వారా ఎంపిక చేసి అప్పగించాలి. ముఖ్యంగా గత జూన్ 25న ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను రద్దు చేయాలని ప్రభుత్వ ఫస్ట్‌గ్రేడ్ కళాశాల అతిథి లెక్చరర్ల సంఘం జిల్లాధ్యక్షుడు డాక్టర్ దుర్గప్ప ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక మీడియాతో ఆయన మాట్లాడుతూ లెక్చరర్లను ఎటువంటి పక్షపాతం చూపకుండా యథా విధిగా కొనసాగించాలి. ఇప్పటికే కొందరు లెక్చరర్లు వయోవిరమణ అంచులో ఉన్నారని, అలాంటి వారికి రూ.25 లక్షల మొత్తాన్ని, సేవా భద్రతను కల్పించాలి. ఆరోగ్య బీమా, జీవిత బీమా, పీఎఫ్ తదితర సౌకర్యాలను కల్పించాలని ఆయన సీఎంను కోరారు. ఎట్టి పరిస్థితిలోను తమను వీధుల పాలు చేయరాదని ఆయన మొర పెట్టుకున్నారు. ఈ విషయంలో లెక్చలర్లందరికీ న్యాయం చేయాలని దుర్గప్ప కోరారు. సంఘం కార్యదర్శి డీ.సిద్దేశ్, సహకార్యదర్శి రుద్రప్పమని, టీ.జయరాం, శివకుమార్ అంగడి, సంధ్యాబాయి, ఎర్రిస్వామి తదితరులు పాల్గొన్నారు.