
ముక్తిముని శివాచార్యులు ఆదర్శప్రాయులు
● అల్లీపురం రేణాకాశ్రమంలో ఆరాధన
బళ్లారి రూరల్ : పరమపూజ్యలైన శివాచార్యులు స్వామీజీలకు ఆదర్శప్రాయుడని హరగినడోణి పంచవణ్గె సంస్థాన పీఠాధిపతి అభినవ సిద్దలింగ శివాచార్య మహాస్వామి అన్నారు. రేణుకాచార్య ట్రస్టు ఆధ్వర్యంలో రేణుకాశ్రమంలో వీరగంగాధర ముక్తిముని శివాచార్య నాలుగవ ఆరాధనోత్సవాల కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. ముక్తిముని శివాచార్యులు అపారజ్ఞాన సంపన్నులని, భక్తులకు సరళంగా, శాంతి స్వభావంతో ఆధ్యాత్మిక బోధనలు చేసేవారన్నారు. ఆశ్రమానికి వచ్చిన భక్తులకు నిత్యం అన్నసంతర్పణ నిర్వహించేవారని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ముక్తిముని శివాచార్యుల సమాధివద్ద 108కళశాలతో పత్యేకపూజలు నిర్వహించారు. ఆలయం ముందు ధ్వజ స్తంభాన్ని ఏర్పాటుచేశారు. ముత్తైదువులకు ఒడిబియ్యం ఇచ్చారు. ట్రస్టు ప్రముఖులు,భక్తులు పాల్గొన్నారు.

ముక్తిముని శివాచార్యులు ఆదర్శప్రాయులు