
నేత్రపర్వం.. ఊరమ్మదేవి రథోత్సవం
హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి పట్టణంలోని గ్రామ దేవత శ్రీ ఊరమ్మ దేవి రథోత్సవం గురువారం సాయంత్రం లక్షలాది మంది భక్తుల సమక్షంలో ఘనంగా జరిగింది. గత మంగళవారం ప్రారంభమైన రథోత్సవం మతపరమైన కార్యక్రమాల తర్వాత గురువారం ఉదయం పట్టణం నుంచి భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూలు, పండ్లు, గింజలు, చీరలు, బియ్యం సమర్పించడం ద్వారా తమ భక్తిని ప్రదర్శించారు. 15 ఏళ్ల తర్వాత జరిగిన ఈ జాతరకు పట్టణంలోని ప్రతి ఇంటికి రక్త సంబంధీకులను, సన్నిహితులను ఆహ్వానించారు. ఊరమ్మదేవి జాతరలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల నుంచి తమ సోదరీమణులను జాతరకు ఆహ్వానించి, వారికి కొత్త చీరలు పెట్టి, బియ్యంతో వేడుకలు జరుపుకున్నారు.
హాజరైన లక్షలాది మంది భక్తులు
రథోత్సవంలో భాగంగా భక్తులు మతపరమైన ఆచారాలు నిర్వహించి, సాయంత్రం ఊరేగింపుగా ఊరమ్మ దేవి అమ్మవారి విగ్రహాన్ని రథంపై ప్రతిష్టించారు. తరువాత కూడ్లిగి జోయిస్ వేణుగోపాల్ ఆచార్ మహామంగళ రథం నిర్వహించి రథోత్సవాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళా బృందాలు ఊరేగింపులో పాల్గొన్నాయి. అమ్మవారి ఊరేగింపు, రథోత్సవంలో లక్షలాది మంది భక్తులు అరటిపండ్లు విసిరి భక్తిని ప్రదర్శించారు. మదకరి సర్కిల్, పాదగట్టె సర్కిల్, అంబేడ్కర్ సర్కిల్ మీదుగా పర్యాటక ఆలయం సమీపంలోని ఊరమ్మ నడక దారి వరకు రథాన్ని లాగారు. భక్తులు శ్రీ ఊరమ్మదేవికి ఘనంగా పూజలు నిర్వహించి రథోత్సవాన్ని ముగించారు. లక్షలాది మంది భక్తులు రథోత్సవంలో పాల్గొన్నారు. డీఎస్పీ మల్లేష్ దొడ్డమని నాయకత్వంలో సీఐ ప్రహ్లాద్ ఆర్ చెన్నగిరి, పీఎస్‌ఐ సీ.ప్రకాష్, తమ సిబ్బందితో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
15 ఏళ్ల తర్వాత జరిగిన జాతర
కిటకిటలాడిన కూడ్లిగి వీధులు

నేత్రపర్వం.. ఊరమ్మదేవి రథోత్సవం

నేత్రపర్వం.. ఊరమ్మదేవి రథోత్సవం