
దశాబ్దాలు గడిచినా మారని దశ
రాయచూరు రూరల్: దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి దశాబ్దాలు గడుస్తున్నా గ్రామీణ ప్రాంతాలకు మౌలిక సౌకర్యాలు కల్పించడంలో ప్రజా ప్రతినిధులు కాలయాపన తప్ప మరేం చేయడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సింధనూరు తాలూకా హనుమనగరలో తాగు నీటి పరిస్థితుల్లో ఎలాంటి మార్పు చెందలేదు. ఐదు దశాబ్దాలు గడిచినా గ్రామానికి నీరందడం లేదు. పురాతన కాలంలో తవ్విన నీటి కుంటలే ఆధారంగా ఉన్నాయి. హనుమనగర నుంచి రెండు కి.మీ. నడుచుకుంటూ ఈ.జే.హొసళ్లికి వెళ్లి నీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. గ్రామంలో 50 కుటుంబాలున్నాయి. ఇంటింటికీ జల జీవన్ మిషన్(జేజేఎం) పథకం కింద కొళాయిలు బిగించినా నీటి సరఫరాలో లోపాలు ఉన్నాయి. దీంతో నీటి కుంటలో కలుషిత నీటినే ప్రజలు తాగాల్సిన పరిస్థితి నెలకొంది.
నేటికీ అందని రక్షిత కొళాయి నీరు
మూలన పడిన జేజేఎం పథకం
హనుమనగర వాసులకు తప్పని పాట్లు

దశాబ్దాలు గడిచినా మారని దశ

దశాబ్దాలు గడిచినా మారని దశ

దశాబ్దాలు గడిచినా మారని దశ