
కళ్యాణ కర్ణాటకలో 150 కేపీఎస్ పాఠశాలలు
రాయచూరురూరల్: విద్యా రంగంలో వెనుకబడిన కల్యాణ కర్ణాటకలో కలబుర్గి, యాదగిరి, రాయచూరు, కొప్పళ, బీదర్, బళ్లారి, విజయ నగర జిల్లాలో 150 కర్ణాటక పబ్లిక్ పాఠశాలలు ప్రారంభిస్తున్నట్లు కళ్యాణ కర్ణాటక అభివృద్ధి మండలి అధ్యక్షుడు అజయ్ సింగ్ తెలిపారు. కలబుర్గిలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2025–26 విద్యా సంవత్సరంలో కళ్యాణ కర్ణాటకలో 150 పాఠశాలు ప్రారంభిస్తామన్నారు. ఇందు కోసం రూ. వంద కోట్ల నిధులు కేటాయించినట్లు తెలిపారు. 2025–26లో రూ.5వేల కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు తయారు చేయాలని మంత్రులను, శాసన సభ్యులకు సూచించారు. కలబుర్గిలో నిమాన్స్ శాఖ, డయబెటాలోజి కేంద్రం, రాయచూరు, బీదర్‌లో క్యాన్సర్ అస్పత్రి, కొప్పళలో సూపర్ స్పెషాలిటీ అస్పత్రిల నిర్మాణాలు చేపడుతామన్నారు. సభలో మంత్రులు శరణు ప్రకాశ్ పాటిల్, శివరాజ్ తంగడిగి, ఈశ్వర్ ఖండ్రే, శరణ బసప్ప దర్శనాపూర్, జహార్ అహ్మద్ ఖాన్, అధికారులు సుందరేష్ బాబు, అకాస్ పాల్గొన్నారు.