
విపత్తుల్లో భద్రంగా నిలిచేలా..
మండ్య: మండ్య జిల్లాలో కావేరి నదిపైనున్న కృష్ణరాజసాగర జలాశయం చెంత దాడులు, విపత్తులు జరిగితే సామాన్య పౌరులు ఎలా స్పందించాలి అనేదానిపై జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఆదివారం మాక్‌డ్రిల్ జరిగింది. అగ్ని ప్రమాదాల సమయంలో, అలాగే నీటిలో పడవలు మునిగిన సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తల పైన పోలీసులు, ఫైర్ సిబ్బంది ప్రజలకు అర్థమయ్యేలా విన్యాసాలు చేసి చూపించారు. డ్యాం వద్దనున్న బృందావన ఉద్యానవనంలో బోటింగ్ పాయింట్ వద్ద నీటమునిగితే వారిని ఎలా రక్షించాలి అనే విన్యాసాలను ప్రదర్శించారు. అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు ఎలా స్పందించాలో వివరించారు. ప్రమాద సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాక్‌డ్రిల్‌లో వివరించారు. గాయపడినవారికి ప్రథమ చికిత్స చేయడం, ఆస్పత్రికి తీసుకెళ్లడం చేసి చూపించారు. ఈ డ్రిల్‌లో జిల్లాధికారి కుమార, జడ్పీ సీఈఓ కెఆర్ నందిని, ఎస్పీ మల్లికార్జున బాలదండి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
కేఆర్‌ఎస్ డ్యాం వద్ద మాక్ డ్రిల్

విపత్తుల్లో భద్రంగా నిలిచేలా..

విపత్తుల్లో భద్రంగా నిలిచేలా..