
నాణ్యత భ్రమ
బ్రాండెడ్ జలం..
బొమ్మనహళ్లి: మార్కెట్లో అనేక రకాల బ్రాండ్ల పేరుతో ప్లాస్టిక్ బాటిళ్లలో తాగునీరు లభిస్తోంది. ఆ నీరు శుభ్రంగా ఉంటుందని అనుకుంటారు. అయితే ఆ నీరు సురక్షితం కాదని రాష్ట్ర ఆహార సురక్షత శాఖ తెలిపింది. ఆ శాఖ ఫిబ్రవరి, మార్చి నెలల్లో నీరు, కొన్ని ఆహారాలపై తనిఖీలు చేసి ఫలితాలను విడుదల చేసింది. ఫిబ్రవరిలో సుమారు 3,698 ఆహార పదార్థాల నమూనాలను సేకరించి ల్యాబ్‌లో పరీక్షించారు. 236 తాగునీటి బాటిళ్ల నీటి నమూనాలను పరీక్షలకు పంపారు. అందులో 255 నమూనాల విశ్లేషణ పూర్తయింది. ఇందులో 72 నమూనాలు సురక్షితమని తేలాయి. 95 నమూనాలు సురక్షితం కాదని వెల్లడైంది. 88 నమూనాలలో నాణ్యత లేని నీరు ఉందని తెలిపారు.
పచ్చి బఠానీలు సమస్యే
●మార్చిలో మొత్తం 3,204 ఆహార పదార్థాలను సేకరించి ల్యాబ్‌లో పరీక్షలు చేయించారు. 49 రకాల నెయ్యి శాంపిళ్లను ల్యాబ్‌కు పంపగా అందులో 6 నమూనాల పరీక్షలు పూర్తయ్యాయి. అవి సురక్షితమని తేలింది.
● ఇక పచ్చి బఠానీలలో 115 నమూనాలను పరీక్షించగా, 69 నమూనాలు సురక్షితం కాదని వెల్లడైనట్లు తెలిపారు.
● 43 పాలకోవా స్వీట్లను సేకరించి ప్రయోగాలయానికి పంపారు. వాటిలో 9 పరిశీలన పూర్తయింది. అందులో 3 నమూనాలలో నాణ్యత చాలా తక్కువగా ఉందని వెల్లడైంది. 6 సురక్షితమని తేలింది. మిగతా ఫలితాలు రావాల్సిఉంది.
● 231 పన్నీరు నమూనాలను పంపగా, 32 నమూనాలలో అసలు నాణ్యత లేదు, తినడానికి పనికిరావని నివేదిక వచ్చింది. 30 నమూనాలు సురక్షితమని తెలిపారు.
ఫుడ్ సేఫ్టీ విభాగం తనిఖీలలో వెల్లడి

నాణ్యత భ్రమ