
కొడగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
యశవంతపుర: మృతుశకటమైన లారీ కారును లారీ ఢీకొని నలుగురిని బలి తీసుకుంది. ఈ ఘోర ప్రమాదం కొడగు జిల్లా మడికేరి తాలూకా దేవరకొల్లి వద్ద శుక్రవారం ఉదయం జరిగింది. మృతులను పోన్నంపేట తాలూకా గోణికొప్పకు చెందిన రిజ్వాన్, నహీద్, రాకిబ్, నిహద్‌గా గుర్తించారు. వీరందరి వయస్సు దాదాపు 25 సంవ్సరాలు ఉంటుంది. ఒకే గ్రామానికి చెంది వీరంతా శుక్రవారం కారులో మడికెరి నుంచి సుళ్యకు వెళ్తుండగా దేవరకొల్లివద్దకు రాగానే సుళ్య నుంచి మడికెరికి వెళ్తున్న లారీ ఎదురై మృత్యుశకటంలా మారి బలంగా ఢీకొంది. దీంతో కారు నుజ్జయ్యింది. అందులో ఉన్న నలుగురిలో ఇద్దరు యువకులు అక్కడిక్కడే మృతి చెందారు. ప్రమాదంలో గాయపడిన ఇద్దరిని శరత్ బృందం రక్షించటానికి అంబులెన్స్‌లో సుళ్య ఆస్పత్రికి తరలించగా ప్రయోజనం లేకపోయింది. బలమైన గాయలు కావటంతో రక్తస్రావంతో ఇద్దరు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సుళ్య ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను సంబంధీకులకు అప్పగించారు. కాగా మృతులందరూ ఒకే గ్రామానికి చెందినవారు కావటంతో ఆ గ్రామం శోకసముద్రంగా మారింది. మృతదేహాలను గ్రామానికి తీసుకురాగా పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి జరిగిన ఘోరాన్ని తలుచుకొని విలపించారు.
ప్రమాదంలో మృతి చెందిన యువకులు
కారును ఢీకొన్న లారీ
నలుగురు మృత్యువాత

కొడగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం