
మలెనాడులో వర్షాల జోరు
శివమొగ్గ: మలెనాడులోని కొండ ప్రాంతాల్లో రుతుపవన వర్షాలు ఊపందుకున్నాయి. దీని ఫలితంగా తుంగా, భద్రా, లింగనమక్కి జలాశయాల్లోకి ఇన్‌ప్లో గణనీయంగా పెరిగింది. జూలై 24న ఉదయానికి రాష్ట్రంలోని ప్రధాన జల విద్యుత్ కేంద్రమైన లింగనమక్కి ఆనకట్టలోకి ఇన్‌ఫ్లో 40,415 క్యూసెక్కులకు పెరిగింది. 4864 క్యూసెక్కుల నీటిని దివకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఆనకట్ట నీటిమట్టం 1806.40 అడుగులుగా ఉంది. భద్రా జలాశయానికి 20,407 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోండగా, 8,914 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక తుంగా జలాశయానికి ఇన్‌ఫ్లో 33,701 క్యూసెక్కులకు పెరిగింది. దీంతో హొసపేటె సమీపంలోని తుంగభద్ర డ్యాంకు 33,565 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు.