
భక్తిశ్రద్ధలతో శ్రావణమాస పూజలు
బళ్లారిఅర్బన్: శ్రావణమాస మొదటి శనివారం సందర్భంగా నగరంలోని వివిధ ఆలయాల్లో శ్రావణమాస పూజలను భక్తిశ్రద్ధలతో జరిపారు. నగరంలోని కోటలో వెలసిన ఆంజనేయ స్వామి ఆలయం, బెంగళూరు రోడ్డులోని బాలాంజనేయ స్వామి ఆలయం, అనంతపురం రోడ్డు అభయ వరదాంజనేయ స్వామి ఆలయం, మిల్లర్‌పేట్ ఆంజనేయ స్వామి ఆలయం, విద్యానగర్ ఆభయ ఆంజనేయ స్వామి ఆలయం, శ్రీరాంపుర కాలనీలోని పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం, కురిహట్టి ఆంజనేయ స్వామి ఆలయం, బస్‌డిపో సమీపంలోని మడికేరి ఆంజనేయ స్వామి ఆలయం, మోకా ఆంజనేయ స్వామి ఆలయం తదితర సీతారామ ఆంజనేయ స్వామి ఆలయాల్లో పంచామృతాభిషేకం, వివిధ రూపాల్లో అలంకరణలు, మహామంగళ హారతితో భక్తులకు దర్శనం కల్పించి, ప్రసాదం పంపిణీ చేశారు.

భక్తిశ్రద్ధలతో శ్రావణమాస పూజలు