
ఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసు అధికారులు
15 ఏళ్ల క్రితం వీరు ప్రేమించుకుని కులాంతర వివాహం చేసుకున్నారు.
కర్ణాటక: భార్యపై అనుమానం పెనుభూతంగా మారింది. ఆమె నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. చింతామణి తాలూకా కొండ్లగానపల్లి గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుంది. వివరాలు... గ్రామానికి చెందిన సురేశ్, వినోదమ్మ భార్య భర్తలు. 15 ఏళ్ల క్రితం వీరు ప్రేమించుకుని కులాంతర వివాహం చేసుకున్నారు. వీరికి తొమ్మిదేళ్ల కుమార్తె ఉంది. ఇదిలా ఉంటే తరచూ భార్యపై సురేశ్ అనుమానపడి గొడవకు దిగేవాడు.
సోమవారం కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తీవ్ర ఆగ్రహంతో ఉన్న సురేశ్ మంగళవారం తెల్లవారుజామున నిద్రలో ఉన్న వినోదమ్మను వేటకొడవలితో గొంతు కోసి పారిపోయాడు. కూతురు విషయం గుర్తించి గట్టిగా కేకలు వేయడంతో చుట్టపక్కల వారు అక్కడికి వచ్చి హత్య విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు. ఘటన స్థలాన్ని ఏఎస్పీ కుశాల్‌చౌక్సీ, కంచార్లపల్లి ఎస్‌ఐ పరుషోత్తం, బట్లపల్లి ఎస్‌ఐ పునీత్‌లు పరిశీలిచారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.