బీఆర్‌ఎస్‌ బల్దియా ముట్టడి | - | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ బల్దియా ముట్టడి

Oct 10 2026 1:10 AM | Updated on Oct 10 2026 1:10 AM

బీఆర్‌ఎస్‌ బల్దియా ముట్టడి ● బతుకమ్మ ఏర్పాట్లు ఏవంటూ ఆందోళన

కరీంనగర్‌ కార్పొరేషన్‌: బతుకమ్మ పండుగ ఏర్పాట్లలో నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ బీఆర్‌ఎస్‌ బల్దియా ముట్టడికి ప్రయత్నించింది. శుక్రవారం నగరపాలకసంస్థ కార్యాలయం మార్కెట్‌ గేట్‌ ఎదుట బీఆర్‌ఎస్‌ నాయకులు ఆందోళన చేపట్టారు. కార్యాలయం లోనికి రాకుండా పోలీసులు గేట్‌ మూసివేశారు. ముందుగానే లోనికి వెళ్లిన బీఆర్‌ఎస్‌ నాయకులను గుర్తించి, బయటకు పంపించారు. పలుమార్లు బీఆర్‌ఎస్‌ నాయకులు కార్యాలయం లోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. పాలకవర్గానికి, బీజేపీ, కాంగ్రెస్‌ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమను లోనికి వెళ్లేందుకు అనుమతివ్వకపోవడంపై పోలీసులతో పలువురు నాయకులు వాగ్వాదానికి దిగారు. ఆందోళన చేస్తున్న బీఆర్‌ఎస్‌ నాయకులను అక్కడి నుంచి బలవంతంగా పోలీసులు తరలించారు. ఈ సమయంలో కార్యాలయంలోనికి వెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్‌ఎస్‌ నాయకుడు సర్దార్‌ సోహన్‌ సింగ్‌ కాలుకు గాయం కావడంతో హాస్పిటల్‌కు తరలించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ బతుకమ్మ, దసరా పండుగల కోసం ఏర్పాట్లు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. నగరంలో చాలా చోట్ల వీధిదీపాలు వెలగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిరసనలో బీఆర్‌ఎస్‌ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్‌, మాజీ మేయర్‌, కార్పొరేటర్‌ సర్ధార్‌ రవీందర్‌ సింగ్‌, గందె మాధవి, ఎడ్ల సరిత, గుగ్గిళ్ల జయశ్రీ, జంగిలి ఐలెందర్‌యాదవ్‌, పొన్నం అనిల్‌గౌడ్‌, సోహన్‌సింగ్‌, ఎడ్ల అశోక్‌, యూసుఫ్‌, జమ్ము, నలువాల ర వీందర్‌, గాదె రూప శ్రీనివాస్‌, ప్రదీప్‌యాదవ్‌, కర్ర సూర్యశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement