ఓటు చోరీని అరికట్టాలి | - | Sakshi
Sakshi News home page

ఓటు చోరీని అరికట్టాలి

Oct 9 2026 1:44 AM | Updated on Oct 9 2026 1:44 AM

కరీంనగర్‌ కార్పొరేషన్‌: దేశంలో బీజే పీ ఓటు చోరీని అరికట్టేందుకు మరో స్వాతంత్య్ర ఉద్యమానికి సిద్ధం కా వాలని కరీంనగర్‌ కార్పొరేషన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వైద్యుల అంజన్‌కుమార్‌ పిలుపునిచ్చారు. ఓటు చోరీకి వ్యతిరేకంగా పోరాడుతున్న రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ, ఇండియాకూటమి ఎంపీలపై జరిగిన లాఠీ చార్జీని నిరసిస్తూ గురువారం నగరంలోని కిసాన్‌నగర్‌ మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నల్లబ్యాడ్జీలు ధరించి ప్రదర్శన చేపట్టారు. సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ లక్షలాది మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓటర్లను తొలగిస్తూ బీజేపీ గెలవడానికి సహకరిస్తున్నారని, ఆయన్ను తొలగించాలని డిమాండ్‌ చేశారు. ఏఎంసీ చైర్మన్‌ ఆకుల నర్సయ్య, చాడగొండ బుచ్చిరెడ్డి, మల్లికార్జున రాజేందర్‌, వరాల నర్సింగం, కల్లపెల్లి బాలరాజు, సరిల్ల ప్రసాద్‌, ఆకుల ఉదయ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement