కరీంనగర్: ‘కిసాన్‌నగర్ బండి సంజయ్ అడ్డా... అందుకే కిసాన్‌నగర్‌తో పాటు కార్పొరేషన్‌ను బీజేపీకి అప్పగించారు’ అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్‌రావు అన్నారు. గురువారం బీజేపీ జిల్లాశాఖ ఆధ్వర్యంలో కిసాన్‌నగర్ గాంధీ విగ్రహం నుంచి చింతల వరకు బైక్‌ర్యాలీ నిర్వహించారు. కిసాన్‌నగర్‌లో రూ.65 కోట్లతో అభివృద్ధి చేశామని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ చెప్పడం సరికాదన్నారు. బండి సంజయ్‌కు ఈ ప్రాంతంతో విడదీయరాని అనుబంధం ఉందన్నారు. బీజేపీ కార్యక్రమాలు, ఎన్నికల ప్రచారాలు ఈ ప్రాంతం నుంచే ప్రారంభించడం ఆనవాయితీగా మారిందన్నారు. కిసాన్‌నగర్ ప్రజల అభిమానాన్ని కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మార్చలేవని స్పష్టం చేశారు.


