కొండగట్టు ఘాట్‌ రోడ్‌కు రూ.200 కోట్లు మంజూరు | - | Sakshi
Sakshi News home page

కొండగట్టు ఘాట్‌ రోడ్‌కు రూ.200 కోట్లు మంజూరు

Oct 9 2026 1:44 AM | Updated on Oct 9 2026 1:44 AM

● త్వరలోనే ఫౌండేషన్‌

● త్వరలోనే ఫౌండేషన్‌

సాక్షిప్రతినిధి,కరీంనగర్‌: జగిత్యాల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఘాట్‌రోడ్‌ కోసం రూ.200 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రకటించినట్లు తెలిసింది. ఈనెలలోనే మంత్రులు అడ్లూరి లక్ష్మణ్‌, శ్రీధర్‌బాబు శంకుస్థాపన చేయనున్నట్లు సమాచారం. మెడ్‌కోలు తమ సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేపడుతున్న విషయం తెలిసిందే. కలెక్టర్‌ సత్యప్రసాద్‌, అదనపు డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ రమాదేవి మెడ్‌కోల సమస్యలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, ఆర్‌అండ్‌బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో మాట్లాడారు. ఈ సందర్భంగా కొండగట్టు ఘాట్‌ రోడ్‌కు శంకుస్థాపన చేయనున్న విషయంపై చర్చించినట్లు తెలిసింది.

42 వాహనాలు సీజ్‌.. 115 డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు

కరీంనగర్‌ క్రైం: నగరంలో రాత్రివేళ మద్యం సేవించి వాహనాలు నడిపేవారితోపాటు నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై పోలీసులు కొరడా ఝుళిపించారు. బుధవారం రాత్రి 9గంటల నుంచి అర్ధరాత్రి వరకు కమిషనరేట్‌ పరిధిలో నిర్వహించిన నాకాబందీలో 4,265 వాహనాలను తనిఖీ చేశారు. 115 మందిపై డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు నమోదు చేశారు. సరైన ధ్రువపత్రాలు లేని 42 వాహనాలు సీజ్‌ చేశా రు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 133 స్పాట్‌ చలాన్లు విధించి రూ.66,135 జరిమానా వసూలు చేశారు. 126 వాహనాల నుంచి పెండింగ్‌ చలాన్‌ రూ.50,300 వసూలు చేశారు. 21 ఈ–చలాన్లు, 12 ఈ–పెట్టీ కేసులు నమోదు చేశారు. హుజూరాబాద్‌లో అత్యధికంగా 46, కరీంనగర్‌ రూరల్‌లో 40, కరీంనగర్‌ టౌన్‌లో 29 డ్రంకెన్‌డ్రైవ్‌ కేసులు నమోదయ్యా యి. నాకాబందీ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని సీపీ గౌస్‌ ఆలం స్పష్టం చేశారు.

ఎంహెచ్‌వో సుమన్‌ రిలీవ్‌

కరీంనగర్‌ కార్పొరేషన్‌: నగరపాలక సంస్థ మెడికల్‌ హెల్త్‌ ఆఫీసర్‌గా ఆన్‌ డ్యూటీ ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్న కట్టా సుమన్‌ను బల్ది యా సేవల నుంచి రిలీవ్‌ చేస్తూ నగరపాలక సంస్థ కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. తిరిగి మాతృశాఖ అయిన వైద్య ఆరోగ్యశాఖకు బదిలీ (రిపాట్రియేషన్‌) చేశారు. కొత్తపల్లి పీహెచ్‌సీ పరిధిలోని కమాన్‌పూర్‌ మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌ (ఎంఎల్‌హెచ్‌పీ)గా ఉన్న కట్టా సుమన్‌, గతంలో కలెక్టర్‌ జారీ చేసిన ఉత్తర్వుల మేరకు 2025 జూలై 25న నగర పాలక సంస్థ ఎంహెచ్‌వోగా డిప్యూటేషన్‌పై బాధ్యతలు స్వీకరించారు. ఆ యన కాలపరిమితి 2026 జూలై 24తో ము గిసింది. ఉన్నతాధికారుల నుంచి కాలపరిమితి పొడిగింపునకు ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో, బల్దియా సేవల నుంచి రిలీవ్‌ చేస్తున్నట్లు కమిషనర్‌ ఉత్తర్వులో పేర్కొన్నారు. తన ఆధీనంలోని ఫైళ్లు, రిజిస్టర్లు, పత్రాలు, సామగ్రితో పాటు పూర్తి బాధ్యతలను వెంటనే సహా య కమిషనర్‌కు అప్పగించి రసీదు తీసుకోవా లని, అనంతరం సంబంధిత ఉన్నతాధికారి వద్ద రిపోర్ట్‌ చేయాలని కమిషనర్‌ ఆదేశించారు.

‘టీబీ ముక్త్‌ కరీంనగర్‌’కు సమష్టి కృషి

కరీంనగర్‌: జిల్లాను టీబీ రహితంగా మార్చేందుకు వైద్య ఆరోగ్యశాఖతో పాటు ప్రజాప్రతినిధులు, యువత, స్వచ్ఛంద సంస్థలు సమష్టిగా కృషి చేయాలని డిప్యూటీ మేయర్‌ యాదగిరి సునీల్‌రావు, డీఎంహెచ్‌వో రాజగోపాల్‌రావు పిలుపునిచ్చారు. గురువారం కరీంనగర్‌ కలెక్టరేట్‌లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ‘టీబీ ముక్త్‌ భారత్‌ అభియాన్‌’లో భాగంగా ‘జోష్‌’ కార్యక్రమం నిర్వహించారు. టీబీ ముక్త్‌ పంచాయితీలు గుర్తింపు పొందిన 163 గ్రామాల సర్పంచ్‌లకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లడుతూ 2025 జనవరి నుంచి డిసెంబర్‌ వరకు జిల్లాలో 163 గ్రామపంచాయతీలు టీబీ ముక్త్‌ పంచాయతీలుగా గుర్తింపు పొందినట్లు తెలిపారు. వీటిలో నాలుగు గోల్డ్‌, 38 సిల్వర్‌, 121 బ్రాంజ్‌ కేటగిరీల్లో ఉన్నాయని వెల్లడించారు. మిగిలిన గ్రామపంచాయతీలను టీబీ రహితంగా తీర్చిదిద్దేందుకు నిరంతర కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. టీబీ అధికారి హిమబిందు, రెడ్‌క్రాస్‌ ప్రతినిధులు, ఎన్‌సీసీ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement