ఓటర్ల చూపంతా 8 పైనే | - | Sakshi
Sakshi News home page

ఓటర్ల చూపంతా 8 పైనే

Oct 9 2026 1:44 AM | Updated on Oct 9 2026 1:44 AM

సాక్షి పెద్దపల్లి: సర్‌ పక్రియలో భాగంగా కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలో ఓటరు జాబితా సవరణకు ప్రజల నుంచి భారీగా దరఖాస్తులు వచ్చాయి. 2026 జూన్‌ 15 నుంచి అక్టోబర్‌ 7 వరకు కరీంనగర్‌, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఫారం–6, 6ఏ, 7, 8 ద్వారా పెద్ద సంఖ్యలో దరఖాస్తులు అందాయి. ముఖ్యంగా ఓటరు వివరాల సవరణకు ఫారం–8 దరఖాస్తులు అత్యధికంగా నమోదయ్యా యి. నాలుగు జిల్లాల్లో ఓటరు వివరాల సవరణకు సంబంధించి 30,486 దరఖాస్తులు రాగా, సర్‌ పక్రియలో ప్రధానంగా ఓటరు వివరాలు సరి చేసుకోవడంపైనే ఎక్కువ దృష్టిపెట్టారని తెలుస్తోంది.

కొత్త ఓటర్ల నమోదులో కరీంనగర్‌ ముందంజ

కొత్త ఓటర్ల నమోదులో కరీంనగర్‌ నియోజకవర్గం 5,388 దరఖాస్తులతో అగ్రస్థానంలో నిలిచింది. రామగుండం అసెంబ్లీలో 2,298, వేములవాడలో 2,130, సిరిసిల్లలో 1,671 తర్వాతి స్థానాల్లో ఉన్నా యి. ధర్మపురిలో అతి తక్కువగా 565 దరఖాస్తులు వచ్చాయి. జిల్లాల వారీగా చూస్తే కరీంనగర్‌ జిల్లాలో 8,756, పెద్దపల్లిలో 4,631, సిరిసిల్లలో 3,801, జగిత్యాలలో 2,583 దరఖాస్తులు అందాయి.

తప్పుల సవరణకు భారీ స్పందన

ఓటర్ల వివరాల్లో తప్పులను సరిదిద్దుకోవడానికి, చిరునామా మార్పునకు ఉద్దేశించిన ఫారం 8 కింద దరఖాస్తులు పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. ముఖ్యంగా కరీంనగర్‌ నియోజకవర్గంలోనే 9,516 దరఖాస్తులు రాగా, 8,123 సవరించారు. హుజురాబాద్‌లో 2,476, పెద్దపల్లి అసెంబ్లీలో 2,121, జగిత్యాల అసెంబ్లీలో 1,316 దరఖాస్తులు వచ్చాయి.

రామగుండంలో తొలగింపుల హోరు

ఓట్ల తొలగింపు, అభ్యంతరాల కోసం ఉద్దేశించిన ఫారం– 7 కింద రామగుండం నియోజకవర్గంలో 1,509 అభ్యర్థనలు రాగా, 1,241 ఓట్లు తొలగించారు. సిరిసిల్లలో 258, వేములవాడ 374, కరీంనగర్‌ నియోజకవర్గంకు 1,015 దరాఖస్తులు వచ్చాయి. ఇతర నియోజకవర్గాల్లో తొలగింపులు తక్కువగా ఉన్నాయి.

విదేశీ ఓటర్ల నమోదుకు స్పందన కరువు

విదేశాల్లో ఉన్న భారతీయ పౌరుల నమోదుకు ఉద్దేశించిన ఫారం– 6ఏకు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో స్పందన అతి తక్కువగా ఉంది. 12 నియోజకవర్గాల్లో కలిపి 145 దరఖాస్తులు రాగా, వాటిలో నాలుగింటికే పరిష్కారం లభించింది.

ఓటరు జాబితా సవరణకు భారీ స్పందన

కొత్త ఓటర్ల నమోదులో కరీంనగర్‌ ముందంజ

రామగుండంలో ఓట్ల తొలగింపు అభ్యర్థనలు అత్యధికం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement