శివారు ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

శివారు ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యం

Oct 10 2026 1:10 AM | Updated on Oct 10 2026 1:10 AM

శివారు ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యం ● మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌

కరీంనగర్‌ కార్పొరేషన్‌: శివారు, విలీన ప్రాంతాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు నగర మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ తెలిపారు. శుక్రవారం నగరపాలకసంస్థ 28వ డివిజన్‌ విద్యారణ్యపురిలో యూఐడీఎఫ్‌ నిధులు రూ.50 లక్షలతో చేపట్టనున్న డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులకు ఆయన భూమిపూజ నిర్వహించారు. అనంతరం డివిజన్‌లోని సమస్యలు పరిశీలించారు. నగరపాలకసంస్థ పరిధిలో అభివృద్ధి పనులను నిరంతరం కొనసాగిస్తున్నామన్నారు. విలీన, శివారు ప్రాంతాల్లో అనేక సమస్యలున్నాయని, వాటి పరిష్కారానికి ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నట్లు చెప్పారు. 28, 3 డివిజన్‌ల పరిధిలోని శివారు ప్రాంతమైన విద్యారణ్యపురి ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. విద్యారణ్యపురి అభివృద్ధికోసం గతంలో రూ. కోటి నిధులు కేటాయించామని, ఇటీవల రూ.25 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు పూర్తిచేశామన్నారు. బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా ఉత్సవాలను గతంలో కన్నా వైభవంగా నిర్వహించేందుకు రూ.2.80 కోట్లతో ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌లు నూన్యావత్‌ భాస్కర్‌నాయక్‌, సాదినేని లావణ్య మునిందర్‌, డీఈ శ్రీనివాస్‌, కాలనీవాసులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement