వర్షాభావ పరిస్థితులు.. ప్రత్యామ్నాయ చర్యలు | - | Sakshi
Sakshi News home page

వర్షాభావ పరిస్థితులు.. ప్రత్యామ్నాయ చర్యలు

Oct 10 2026 1:10 AM | Updated on Oct 10 2026 1:10 AM

● కలెక్టర్‌ చిత్రా మిశ్రా

కరీంనగర్‌ అర్బన్‌: ఎల్‌నినో వర్షాభావ పరిస్థితులను అధిగమించేందుకు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. శుక్రవారం సీఎస్‌తో వీసీ అనంతరం అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో తాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వర్షాభావ పరిస్థితులకనుగుణంగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామాల్లో నీటి సంరక్షణ పనులను పెద్దఎత్తున చేపట్టడంతోపాటు ఇంటింటికీ ఇంకుడు గుంతలు నిర్మించేలా ప్రజలను ప్రోత్సహించాలని దిశానిర్దేశం చేశారు. అదనపు కలెక్టర్‌ అశ్విని తానాజీ వాకడే, సీపీవో రామ్‌దత్తారెడ్డి, డీఏవో అధికారి ఛత్రునాయక్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement