ఏర్పాట్లు పూర్తిచేశాం | - | Sakshi
Sakshi News home page

ఏర్పాట్లు పూర్తిచేశాం

Oct 9 2026 1:44 AM | Updated on Oct 9 2026 1:44 AM

ఏర్పాట్లు పూర్తిచేశాం కాంగ్రెస్‌తోనే ఆర్టీసీ విలీనం కార్మికుల పక్షాన పోరాటం

ఆర్టీసీ కరీంనగర్‌ రీజియన్‌ పరిధిలో 11 డిపోల్లో 11 పోలింగ్‌ కేంద్రాలు, వర్క్‌ షాప్‌లో ఒకటి, ఆర్‌ఎం కార్యాలయంలో ఒక పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేశాం. ఎన్నికల సామగ్రిని ఆయా కేంద్రాలకు పంపించాం. నేడు ఓటు హక్కు వినియోగించుకోని వారు ఈ నెల 15,16 తేదీల్లో వారివారి డిపోల్లో ఓటు వేయవచ్చు.

– కోల ప్రసాద్‌,

ఆర్టీసీ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి

కాంగ్రెస్‌ ప్రభుత్వంతో ఆర్టీసీ కార్మికులకు మంచి రోజులొచ్చాయి. గత ప్రభుత్వం కార్మికుల హక్కులను హరిస్తూ యూనియన్లను రద్దు చేసింది. 10 ఏళ్ల తరువాత ఎన్నికలు నిర్వహించడంతో పాటు ఇచ్చిన హామీ మేరకు సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడం జరుగుతుంది. కార్మిక లోకం కాంగ్రెస్‌తోనే తమ సమస్యలు పరిష్కరం అవుతాయని ఏకపక్షంగా కూటమి వైపు నిలబడింది.

– కోమటిరెడ్డి నరేందర్‌ రెడ్డి, గౌరవ అధ్యక్షుడు, ఐఎన్‌టీయూసీ కరీంనగర్‌ రీజియన్‌

కార్మికుల న్యాయమైన హక్కుల కోసం నిరంతర పోరాటాలు చేసిన ఘన చరిత్ర ఏఐటీయూసిదే. కార్మిక సమస్యలపై అవగాహన లేని వ్యక్తులున్న యూనియన్లు, పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ఏఐటీయూసీ కూటమి విజయం ఖాయమైంది. మిగిలింది ఓటు వేయడమే. – టేకుమల్ల

సమ్మయ్య, ఏఐటీయూసీ రీజియన్‌ అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement