న్యూస్‌రీల్
మంగళవారం శ్రీ 4 శ్రీ ఆగస్టు శ్రీ 2026
నాలుగు టీఎంసీలు ఎత్తిపోత
క్యారం ఆడి.. పోటీలు ప్రారంభించి
ముస్తాబాద్(సిరిసిల్ల): ఇటీవల కురిసిన వర్షాలకు జిల్లాలో వరినాట్లు జోరందుకున్నాయి. ఉదయం 9.30 గంటలకే వరినాట్లు వేసేందుకు మహిళా కూలీలు పొలాల్లోకి దిగుతున్నారు. శ్రమను మరిచిపోయేందుకు జానపదాలు పాడుతూ నాట్లు వేసే కూలీలు మధ్యాహ్న భోజనాన్ని ఇలా ఒడ్డుపై కూర్చుని కష్టసుఖాలు మాట్లాడుకుంటూ తింటున్నారు. ముస్తాబాద్ మండలం పోతుగల్ శివారులోని పొలాల గట్లపై సోమవారం ఇలా మధ్యాహ్న భోజనం తింటూ కనిపించారు. రోజంతా కష్టపడితే రూ.450 కూలీ వస్తుందని తెలిపారు.
రామడుగు(చొప్పదండి): రామడుగు మండలం లక్ష్మీపూర్ పరిధిలో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు 8వ ప్యాకేజీ గాయత్రి పంపుహౌజ్ నుంచి బాహుబలి మోటార్ల ద్వారా ఇప్పటి వరకు 4 టీఎంసీల నీటిని గ్రావిటీ కాలువ ద్వారా మిడ్ మానేరుకు తరలించడం జరిగిందని ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు. ఐదు బాహుబలి మోటార్ల ద్వారా పంపింగ్ జరుగుతోందని వివరించారు. వర్షాలు ప్రారంభం అయిన నాటి నుంచి పంపింగ్ కొనసాగుతోందని.. వర్షాలు ఇలాగే ఉంటే నీటిని ఎత్తిపోస్తామని తెలిపారు.
కరీంనగర్‌క్రైం: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కోర్టు న్యా యవాదుల ఆటల పోటీలను సోమవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శివకుమార్, మొదటి అదనపు జిల్లా జడ్జి వెంకటేశ్ ప్రారంభించారు. క్యారం, క్విజ్, చెస్, సాంగ్స్, డాన్స్, మ్యూజికల్ చైర్ పోటీలు నిర్వహించనున్నట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్, స్పోర్ట్స్, కల్చరల్ కార్యదర్శి బెజ్జంకి శ్రీకాంత్ తెలిపారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సీహెచ్ కిరణ్‌కుమార్, క్యారం పోటీల ఇన్‌చార్జ్ అర్జిత్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.


