ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం | - | Sakshi
Sakshi News home page

ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం

Apr 9 2026 8:05 AM | Updated on Apr 9 2026 8:05 AM

బీజేపీ, బీఆర్‌ఎస్‌ ‘చెత్త’ రాజకీయాలు ● సుడా చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి

కరీంనగర్‌క్రైం: కరీంనగర్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఇసుక అక్రమ రవాణా, నిల్వ, విక్రయాలపై కఠిన చర్యలు కొనసాగుతున్నాయని, మార్చిలో ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించి 120 కేసులు నమోదు చేశామన్నారు. 139 వాహనాలు స్వాధీనం చేసుకుని, 161 మంది నిందితులపై చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఇసుక అక్రమ రవాణా కారణంగా ప్రభుత్వ ఆదాయానికి నష్టం జరుగుతోందన్నారు. రోడ్డు భద్రత, పర్యావరణ సమతుల్యత, శాంతి భద్రతలపై ప్రతికూల ప్రభావం పడుతోందన్నారు. 2026లో మార్చి వరకు కమిషనరేట్‌ పరిధిలో మొత్తం 245 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయగా, 357 వాహనాలు స్వాధీనం చేసుకుని, 422 మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు

కరీంనగర్‌: స్కానింగ్‌ సెంటర్లలో లింగ నిర్ధారణ చట్టం ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకటరమణ అన్నారు. బుధవారం డీఎంహెచ్‌వో కార్యాలయంలో గర్భస్థ పూర్వ, గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధ చట్టం అమలుపై జిల్లా అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో లింగ నిర్ధారణ నిషేధ చట్టం అమలు తీరును సమీక్షించారు. చట్టాన్ని ఉల్లంఘించిన మూడు స్కానింగ్‌ సెంటర్లకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. లింగ నిర్ధారణ చట్టం పోస్టర్‌ను ఆవిష్కరించారు. లింగ నిర్ధారణ చట్టాన్ని అతిక్రమించినట్లయితే టోల్‌ఫ్రీ నంబర్‌ 9849902501 ద్వారా లేదా నేరుగా కార్యాలయానికి తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

కరీంనగర్‌ కార్పొరేషన్‌: డంప్‌యార్డ్‌పై బీజేపీ, బీఆర్‌ఎస్‌ చెత్త రాజకీయాలు చేస్తున్నాయని సుడా చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి ధ్వజమెత్తారు. డంప్‌యార్డ్‌ సమస్యపై ఒక్కో చోట ఒక్కో రకంగా వ్యవహరిస్తూ రెండు నాలుకల ధోరణితో కరీంనగర్‌, హుజూరాబాద్‌లో నాటకాలు ఆడుతున్నాయని మండిపడ్డారు. బుధవారం నగరంలోని ఆర్‌ఆండ్‌బీ అతిథిగృహంలో మాట్లాడుతూ కరీంనగర్‌లో డంప్‌యార్డ్‌ పాపం బీఆర్‌ఎస్‌, బీజేపీలదేనన్నారు. బీఆర్‌ఎస్‌ అసమర్థ పాలనతోనే డంప్‌యార్డ్‌లో చెత్త గుట్టలుగా పేరుకుపోయిందన్నారు. మానేరు రివర్‌ ఫ్రంట్‌ పేరిట వాగు వెంట తిరిగిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌కు అక్కడే ఉన్న చెత్త గుట్టలు కనిపించలేదా అన్నారు. డంప్‌యార్డ్‌ సమస్యను పరిష్కరిస్తామంటూ కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ను కరీంనగర్‌కు తీసుకువచ్చి హడావుడి చేసిన బండి సంజయ్‌, సమస్యను ఎందుకు పరిష్కరించలేదో చెప్పాలన్నారు. హుజురా బాద్‌ లో బీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు దీక్షల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. కరీంనగర్‌లోని డంప్‌యార్డులో చెత్తను శాసీ్త్రయ పద్ధతిలో తొలగించేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. చాడగొండ బుచ్చి రెడ్డి, సరిళ్ల ప్రసాద్‌, ఎండీ.తాజొద్దీన్‌, పిట్టల రవీందర్‌, వరాల నర్సింగం, పర్వతం మల్లేశం, కాంతాల జగన్‌ రెడ్డి, గుండాటి శ్రీనివాస్‌ రెడ్డి, ఇక్రమ్‌ సికిందర్‌, కొట్టె ప్రభాకర్‌, ఖలీల్‌, దేవేందర్‌ పటేల్‌, హనీఫ్‌ పాల్గొన్నారు.

ఆర్టిజన్‌ కార్మికుల సమ్మె

కరీంనగర్‌: ఆర్టిజన్‌ కార్మికులు బుధవారం ఉదయం 9 గంటల నుంచి విధులు బహిష్కరించి సర్కిల్‌ కార్యాలయాల ఎదుట నిరవధిక సమ్మె చేపట్టారు. ఇటీవల వరంగల్‌ ఎన్‌నపీడీసీఎల్‌ కార్యాలయం ఎదుట సుమారు 15వేల మంది కార్మికులతో మహాధర్నా చేపట్టగా.. స్పందన లేకపోవడంతో ఆందోళనను ఉధృతం చేశారు. ఆర్టిజన్‌ కార్మికులకు కన్వర్షన్‌ కల్పించడం, ఒకేసంస్థలో ఒకే రూల్స్‌ అమలు చేయడం, అన్‌మ్యాన్‌ వర్కర్లను ఆర్టిజన్లుగా గుర్తించడం, పీస్‌రేట్‌, బిల్‌ కలెక్టర్లకు వేతనాలు చెల్లించాలని కోరారు.

డీఆర్డీవోగా గీత

కరీంనగర్‌ అర్బన్‌: జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి(డీఆర్డీవో)గా మచ్చ గీతను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరీంనగర్‌ డీఆర్డీవో ఉప్పుల శ్రీధర్‌ను రాజన్న సిరిసిల్లకు బదిలీ చేశారు. గత నెల 17న సీఈవోలుగా పదోన్నతులు పొందగా స్థానచలనం కల్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement