● మాజీ మేయర్ రవీందర్‌సింగ్
కరీంనగర్‌టౌన్: కరీంనగర్ కార్పొరేషన్ అవినీతికి అడ్డాగా మారిందని మాజీ మేయర్ రవీందర్‌సింగ్ ఆరోపించారు. బుధవారం తారక హోటల్‌లో మాట్లాడుతూ ఇటీవల జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ సోదాల్లో బయటపడిన అవినీతి మాదిరిగానే, కరీంనగర్ మున్సిపల్‌లోనూ భారీ అక్రమాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. టౌన్ ప్లానింగ్ విభాగం అవినీతికి నిలయంగా మారిందన్నారు. చింతకుంటలోని సర్వే నంబర్ 439లో ఉన్న 2 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని ఓ బీజేపీ నాయకుడు ప్లాట్లు చేసి బహిరంగంగా మార్కెట్‌లో అమ్ముకుంటున్నాడని స్వయంగా ఆధారాలను బయటపెట్టారు. అల్గునూరులో ప్రభుత్వ భూములను అక్రమార్కులు ఎటువంటి అనుమతులు లేకుండానే టౌన్ ప్లానింగ్ అధికారులతో కుమ్మకై ్క ఓపెన్ ప్లాట్లుగా మార్చి, అమ్ముకుంటున్నారని అన్నారు. అవినీతిపై కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


