నాపై కోపముంటే ఉరి తీయండి | - | Sakshi
Sakshi News home page

నాపై కోపముంటే ఉరి తీయండి

Apr 8 2026 8:20 AM | Updated on Apr 8 2026 8:20 AM

నాపై కోపముంటే ఉరి తీయండి ● ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి

హుజూరాబాద్‌: ‘నాపై ప్రభుత్వానికి కోపం ఉంటే అంబేద్కర్‌ చౌరస్తా వద్ద ఉరి తీయండి. కానీ, ప్ర జల ప్రాణాలకు, పంటలకు ముప్పు వాటిల్లే డంప్‌ యార్డ్‌ను రద్దు చేయాలి’ అని హుజూరాబాద్‌ ఎ మ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తా వద్ద డంపింగ్‌యార్డ్‌ వ్యతి రేక అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిబిరంలో మంగళవారం ఎమ్మెల్యే 24 గంటల దీక్షకు పూనుకున్నారు. మొదట నాయకులతో కలిసి అంబేద్కర్‌ విగ్రహానికి, తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళి అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, డంప్‌యార్డు ఏర్పాటు వల్ల ప్రజలకు నష్టమే ఎక్కువ అవుతుందని, ప్రభుత్వం పునరాలోచన చేసి ఏర్పాటును మానుకోవాలన్నారు. ప్రజల ప్రాణాలు, పర్యావరణానికి హాని చేసే డంపింగ్‌యార్డ్‌ రద్దు కోసం రాజకీయాలకతీతంగా ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు. శాంతియుత నిరసనలకు ప్రభుత్వం దిగి రాకుంటే ఉద్యమం ఉగ్రరూపం దాలుస్తుందన్నారు. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌, ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ బండ శ్రీనివాస్‌, పలకల ఈశ్వర్‌రెడ్డి, ఎడవెల్లి కొండాల్‌రెడ్డి, రవీందర్‌రావు, గందె రాధిక, రత్నం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement